టాలీవుడ్‌ ‘అరుంధతి’ తార.. అనుష్క!

‘సూపర్‌’తో వెండితెరకు పరిచయమై.. టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది అనుష్క. ప్రస్తుతం సినిమాలు చేయకున్నా.. ఆమె క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. 

image:RKC

‘అరుంధతి’ చిత్రంతో లేడీ సూపర్‌స్టార్‌ అనిపించుకున్న ఈ స్వీటీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

image:RKC

 ఈమె జంతు ప్రేమికురాలు. ఇంట్లో ఎక్కువగా శునకాలను పెంచుకుంటుంది. వాటితో ఫొటో దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది. 

image:RKC

అనుష్క.. కర్ణాటకలోని మంగళూరులో 1981 నవంబర్‌ 7న జన్మించింది.

image:RKC

బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌లో పట్టా అందుకున్న ఈ జేజమ్మ.. సినిమాలకు రాకముందు యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసింది.

image:RKC

నిజానికి అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి.. సినిమాల్లో ఆ పేరు అంతగా బాగోదని పూరీ జగన్నాథ్‌ ఆమె పేరును అనుష్కగా మార్చారు. 

image:RKC

గత జులై నాటికి ఈ ‘భాగమతి’ టాలీవుడ్‌లో అడుగుపెట్టి 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘17 ఏళ్ల ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకుంది.  

image:RKC

తనకు స్నేహితులంటే చాలా ఇష్టం. స్నేహం కావాలా! సినిమాలు కావాలా అంటే స్నేహం కోసం సినిమాలు వదిలేసుకుంటా అని ఓ సందర్భంలో చెప్పింది. 

image:RKC 

జేజమ్మకు ఫేస్‌బుక్‌లో 28మిలియన్, ఇన్‌స్టాలో 5.7 మిలియన్, ట్విట్టర్లో 9.9 లక్షల మంది ఫాలోవర్లున్నారు. 

image:RKC

సినిమాల్లోకి రాకుంటే యోగా టీచర్‌గా స్థిరపడేదట! కానీ, ఇండస్ట్రీలో ఆమె స్టార్‌హీరోలతో నటించి అగ్రనాయికగా పేరు తెచ్చుకుంది. 

image:RKC

ఆమె సినిమాల్లో ‘సైజ్‌ జీరో’చాలా స్పెషల్‌. అందులోని పాత్రకు న్యాయం చేసేందుకు అనుష్క.. ఏకంగా 20 కిలోల బరువు పెరిగింది. 

image:RKC

ప్రభాస్‌, రానా అనుష్కకు మంచి స్నేహితులు. వారితో కలిసి ఆమె నటించిన ‘బాహుబలి’ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే.

image:RKC

ప్రస్తుతం అనుష్క.. మలయాళంలో ‘ఒట్టక్కోంబన్‌’లో నటిస్తుంది. నవీన్‌ పొలిశెట్టి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో చెఫ్‌ ‘అన్విత రవళి శెట్టి’గా కనిపించనుంది.  

image:RKC

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home