లాంగ్‌ కెరీర్‌.. ‘అనుష్క’ సూత్రాలివే!

హీరోయిన్‌ కెరీర్‌ పట్టుమని పదేళ్లు ఉండడం గొప్ప విషయం. అనుష్క ఆ మార్క్‌ను దాటేసి దాదాపు పదేళ్లు అవుతోంది. లాంగ్‌ కెరీర్‌ వెనుక రహస్యాన్ని స్వీటీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ సూత్రాలేంటో చూద్దాం..   

ఏ రంగంలోనైనా ఎక్కువ కాలం రాణించాలంటే ఇష్టం, నిజాయతీతో పని చేయాలి. సమస్యలకు భయపడకూడదు. 

కెరీర్‌ ప్రారంభంలో చేసే పనిపై నాలాగా కొందరికి అవగాహన లేకపోవచ్చు. మెలకువలు తెలుసుకుని ముందుకెళ్లాలి. నిత్య విద్యార్థిగా మెలగాలి.

మానసికంగా దృఢంగా ఉండాలంటే యోగా, వ్యాయామంలాంటివి తప్పనిసరి. అవరోధాలు అధిగమించాలంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే.

పరోక్షంగా కొందరు మన విజయంలో భాగమవుతారు. వారే లేకపోతే సక్సెస్‌ ఉండదు. అందుకు కృతజ్ఞతతో ఉండాలి.

జీవితం ఎప్పుడెలా మలుపు తీసుకుంటుందో తెలియదు. అందుకే దేనికైనా సిద్ధంగా ఉండాలి. మెడిసిన్‌ చదవాలనుకున్నా. సైకియాట్రిస్ట్‌ కావాలనుకున్నా చివరిగా నటిగా మారా.

మనం ఖాళీగా ఉన్నా, సూపర్‌స్టార్‌గా ఎదిగినా స్వచ్ఛమైన ప్రేమను పంచేది అమ్మానాన్నే. వారిని ఎప్పుడూ గౌరవించాలి.

ఇతరుల్లా ఉండాలనుకోవద్దు. ఎవరి ప్రతిభ వారిది. రంగం ఏదైనా మనదైన మార్క్‌ చూపించాలి. 

విద్యార్థి దశలో నేను మితభాషిని. చదువులోనూ అంతంత మాత్రమే అయినా మా ప్రిన్సిపల్‌ ప్రోత్సహించేవారు. మనం ఎలా ఉన్నా కొందరు మన వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారనే విషయం మర్చిపోవద్దు.

మనతో ఇతరులు ఎలా ఉండాలనుకుంటామో.. వారితోనూ మనం అలాగే వ్యవహరించాలి. వీలైనంత సానుకూలంగా ఉండాలి.

ఏదైనా ఘటన జరిగితే దానిపై కామెంట్‌ చేయడం తేలిక. కానీ, ఒకరు చెబితే సమాజం మారదు. ఇల్లు, స్కూల్‌, కాలేజీ దశల్లోనే మార్పు రావాలి.

2005లో ‘సూపర్‌’తో తెరంగేట్రం చేసిన అనుష్క.. 50 చిత్రాలకు చేరువయ్యారు. ‘ఘాటి’, ‘కథనార్‌’లో ప్రస్తుతం నటిస్తున్నారు.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home