ఏ అప్పు ముందు కట్టాలి..?
ఆర్థిక, భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకుల్లో వివిధ రకాల రుణాలు తీసుకుంటుంటాం. అయితే, చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఏ అప్పు ముందు తీర్చాలో తోచదు. ఎక్కువ వడ్డీ ఉన్న రుణాలను ముందుగా తీరిస్తే ఆర్థిక భారం తగ్గుతుంది. అప్పు చెల్లింపులో ఈ ప్రాధాన్యతా క్రమాన్ని ఫాలో అయిపోండి.
Image: RKC
క్రెడిట్‌కార్డ్
క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుంటే 12 శాతం నుంచి 40 శాతం వడ్డీ ఉంటుంది. అందుకే, ఈ రుణం ఉంటే ముందుగా దీన్నే తీర్చేయాలి. అలాగే, క్రెడిట్ కార్డు బిల్లునూ నిర్ధిష్ఠ సమయంలో చెల్లించాలి. లేదంటే బ్యాంకులు భారీ మొత్తంలో వడ్డీలు విధిస్తాయి.
Image: RKC
వ్యక్తిగత రుణాలు
ఈ రుణాలకు వడ్డీ 10 శాతం నుంచి 18 శాతం వరకు ఉంటుంది. ఏడాది నుంచి ఐదేళ్లపాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. వీలైనంత తొందరగా ఈ అప్పు తీర్చేస్తే.. వడ్డీ భారం తప్పుతుంది.
Image: RKC
విద్యారుణం
పిల్లల చదువుల కోసం ఈ రుణాలు చేస్తుంటారు. వీటి వడ్డీ 9 శాతం నుంచి 11 శాతం ఉండొచ్చు. పిల్లలు ఉద్యోగాలు చేసి అప్పు తీర్చే బదులు.. డబ్బు ఉంటే ప్రాధాన్యతా క్రమంలో ఈ అప్పు తీర్చడం ఉత్తమం.
Image: RKC
బంగారంపై రుణం
డబ్బు అవసరమైనప్పుడు ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటుంటారు. దీనిపై వడ్డీ 8 శాతం నుంచి 12 శాతం ఉంటుంది. ఎక్కువకాలం ఈ రుణాన్ని కొనసాగించకూడదు.
Image: RKC
షేర్లు/ఆస్తులపై రుణం
ఆస్తులు, షేర్లు చూపించి రుణం తీసుకునే అవకాశముంది. అయితే, దీనిపై వడ్డీ రేటు 8 శాతం నుంచి 11 శాతం వరకు ఉంటుంది. కాస్త తీరికగా ఈ రుణాన్ని తీర్చుకోవచ్చు.
Image: RKC
వాహన రుణం
వాహనరుణాలపై వడ్డీ 7 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటుంది. ఈ రుణం పెద్ద మొత్తం కాకపోయినా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తేనే ఉత్తమం. ఈఎంఐ సమయంలో వాహనానికి ఏదైనా జరిగితే.. బ్యాంకులు వెంటనే స్పందించి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తాయి.
Image: RKC
గృహరుణం
గృహరుణం అనేది పెద్దమొత్తంలో.. సుదీర్ఘకాలం చెల్లించే అప్పు. వీటిపై వడ్డీ రేటు 7 శాతం నుంచి 9.5 శాతం ఉంటుంది. ఒకేసారి రుణం తీర్చడం చాలా కష్టం. ఒకవేళ అంత డబ్బు ఉంటే.. ముందుగా చెప్పుకున్న రుణాలు తీర్చి.. ఆ తర్వాత గృహరుణం చెల్లించడం మంచిది.
Image: RKC