‘పిల్లా పులి’..అపర్ణ బాలమురళి

 మాలీవుడ్‌ నటి అపర్ణ బాలమురళి 2015లో నటిగా అరంగేట్రం చేసింది.

#Instagram/Aparna Balamurali 

పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించినప్పటికీ  ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

#Instagram/Aparna Balamurali 

సూర్య హీరోగా వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ (తమిళంలో సూరారై పోట్రు)లో బేబి పాత్రతో ఆమె కెరీర్‌ మలుపు తిరిగింది. #Instagram/Aparna Balamurali 

ఇందులో తన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

#Instagram/Aparna Balamurali

ఈ సినిమాలో నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డుకు ఎంపికైంది.

#Instagram/Aparna Balamurali 

ఈ ముద్దుగుమ్మ 1995 సెప్టెంబరు 11న కేరళలోని త్రిస్సూర్‌లో జన్మించింది.

#Instagram/Aparna Balamurali 

అపర్ణ నట ప్రస్థానం బాలనటిగా మొదలైంది. తర్వాత కొన్ని లఘుచిత్రాలు చేసింది. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

#Instagram/Aparna Balamurali  

‘నాకు చిన్నప్పటి నుంచే నటనంటే ఆసక్తి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

#Instagram/Aparna Balamurali 

అపర్ణ మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ మాత్రమే కాదు, నేపథ్య గాయని కూడా. మలయాళంలో పలు మ్యూజిక్‌ ఆల్బమ్‌లు కూడా చేసింది.

#Instagram/Aparna Balamurali 

అపర్ణ ఒక తమిళ సీరియల్‌, ‘ఫింగర్‌టిప్‌-2’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది.

#Instagram/Aparna Balamurali 

‘ఓర్‌ సెకండ్ క్లాస్‌ యాత్ర’,‘సర్వోపరి పాలక్కారన్’, ‘మహేషింటే ప్రతీకారం’ ‘సండే హాలిడే’ చిత్రాల్లో ఆమె నటనకు పలు అవార్డులు వచ్చాయి.

#Instagram/Aparna Balamurali 

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home