కొత్త ‘యాపిల్స్‌’ వచ్చేస్తున్నాయ్‌!

Apple 14 Event: 

యాపిల్‌ కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతోంది. ఏడో తేదీన ఏమేం ప్రోడక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందంటే?

Image:Apple

యాపిల్‌ తన కొత్త ఉత్పత్తులను యూఎస్‌లోని కుపెర్టినోలో ఉన్న యాపిల్‌ పార్క్‌లో బుధవారం రాత్రి 10.30 తర్వాత లాంఛ్‌ చేయనుంది.

Image:Apple

కొవిడ్‌ -19 పరిస్థితుల తర్వాత జరుగుతున్న తొలి ఇన్‌ పర్సన్‌ (నాన్‌ వర్చువల్‌) ఈవెంట్‌ ఇదే కావడం గమనార్హం.

Image:Apple

యాపిల్‌ 14 సిరీస్‌ మొబైల్స్‌ను ఈ ఈవెంట్‌లో లాంచ్‌ చేస్తున్నారు. ఐఫోన్‌ 14, 14 ప్లస్, 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ ఈ రోజు ఆవిష్కరిస్తారట.

Image:Apple

కొత్త సిరీస్‌ మొబైల్స్‌ డిస్‌ప్లే టాప్‌లో ఉన్న నాచ్‌ తీసేసి.. రెండు కటౌట్స్‌ (హోల్స్‌) తీసుకొస్తున్నారట.

Image:Apple

గత రెండు సిరీస్‌లుగా విడుదల చేస్తున్న మినీ మోడల్‌.. ఈ ఏడాది ఉండదు. అంటే ఐఫోన్‌ 14 మినీ రాదు.

Image:Apple

యాపిల్‌ కొత్త సిరీస్‌ మొబైల్స్‌లో సరికొత్త A16 చిప్‌ వాడుతున్నారు. బ్యాటరీ సైజ్‌, ఛార్జింగ్‌ సామర్థ్యమూ పెంచుతున్నారట.

Image:Apple 

యాపిల్‌ 8 సిరీస్‌ వాచ్‌లు తీసుకొస్తారు. బైకర్స్‌, హైకర్స్‌కు ఎక్కువగా ఉపయుక్తంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దారట.

Image:Apple

యాపిల్‌ వాచ్‌ 8 ప్రో సిరీస్‌ను హెల్త్‌, ఫిట్‌నెస్‌ లవర్స్‌కు తగ్గట్టుగా రూపొందించారట. దీంతోపాటుు యాపిల్‌ వాచ్‌ SE2 కూడా వచ్చే అవకాశముంది.

Image:Apple

‘ఫార్‌ అవుట్‌’ పేరుతో జరగనున్న ఈ ఈవెంట్‌ను యాపిల్‌ యూట్యూబ్‌ ఛానల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో వీక్షించొచ్చు.

Image:Apple

ఎల్‌ఈ, ఎల్‌సీ3 కోడెక్‌ సాంకేతికత ఉన్న యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రో 2 కూడా ఈ రోజే లాంఛ్‌ అవ్వబోతున్నాయి.

Image:Apple

భారత మార్కెట్లోకి వన్‌ ప్లస్‌ నార్డ్‌ N20 SE

ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకోకండి!

ఫోన్‌ పోయిందా? డిజిటల్ యాప్స్‌ను బ్లాక్‌ చేశారా?

Eenadu.net Home