ఈ యాప్స్ రైలు ప్రయాణికుల కోసమే!
ఐఆర్‌సీటీసీ కనెక్ట్!
ఈ యాప్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రైల్వే టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించవచ్చు. తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే సౌకర్యముంది. రైలే కాదు.. బస్, విమాన టికెట్లు, హోటల్ రూమ్ బుకింగ్స్ తదితర సేవలన్నీ ఈ యాప్ ద్వారా పొందొచ్చు.
Image: Playstore
జూప్
ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టిన యాప్. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. దాన్ని ఈ యాప్ నిర్వాహకులు మీరు ఉన్న రైల్లోనే డెలివరీ చేస్తారు.
Image: Playstore
రైల్ మదద్
రైల్వేకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే ఈ యాప్‌లో చేయొచ్చు. ఫిర్యాదులను ట్రాక్ చేసుకోవచ్చు. ప్రతి స్పందన తెలుసుకోవచ్చు.
Image: Playstore
యూటీఎస్
అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్(యూటీఎస్) యాప్‌లో రిజర్వేషన్ లేని(సెకండ్ క్లాస్) టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
Image: Playstore
ఎన్‌టీఈఎస్
నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్(ఎన్‌టీఈఎస్) యాప్‌తో రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. రైలు ఎక్కడ ఉందో కనుక్కోవచ్చు.
Image: Playstore
ఐఆర్‌పీఎస్‌ఎం
ఇండియన్ రైల్వేస్ ప్రాజెక్ట్స్ సాంక్షన్స్ అండ్ మేనేజ్‌మెంట్ (ఐఆర్‌పీఎస్‌ఎం) యాప్ ద్వారా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఎక్కడి పనులు ఎంత వరకు వచ్చాయి? రైల్వేశాఖ మంజూరు చేసిన నిధులెన్ని తదితర విషయాలు ఇందులో ఉంటాయి.
Image: Playstore
రైల్ సుగమ్
రైలు మార్గంలో సరకులను ఎగుమతి/దిగుమతి చేసుకునే వ్యాపారుల కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. సరకు రవాణాకు ఎంత ఖర్చవుతుంది? సరకుతో ప్రయాణిస్తున్న రైలు ఎక్కడ ఉంది? వంటి వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
Image: Playstore
రైల్ సారథి
భారత రైల్వేకి సంబంధించిన అన్ని యాప్స్ సేవలూ ఈ యాప్‌లో లభిస్తాయి.
Image: Playstore