వీకెండ్‌లో ఎక్స్‌ట్రా ఫుడ్‌.. ఎక్స్‌ట్రా వర్కౌట్స్‌.. 

‘4 లెటర్స్‌’తో 2019లో తెలుగు తెరకు పరిచయమైన అప్సర రాణి.. ‘రాచరికం’తో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనుంది.

అప్సర రాణి, విజయ్‌ శంకర్‌, వరుణ్‌ సందేశ్‌ ప్రధాన పాత్రల్లో సురేశ్‌ లంకలపల్లి తెరెకెక్కించిన ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది.

ఒడిశాలో పుట్టి, దెహ్రాడూన్‌లో పెరిగిన అప్సర అసలు పేరు అంకిత మహారాణా. స్క్రీన్‌ నేమ్‌ కోసం అప్సర రాణిగా పేరు మార్చుకుంది.

కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ చేసింది. ‘అదే సినిమాల్లో అవకాశం తెచ్చిపెట్టింది’ అని చెప్పింది. 

‘క్రాక్‌’, ‘సీటీమార్’, ‘మా ఇష్టం’, ‘హంట్‌’ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకుంది.

సాహసాలను ఎక్కువ ఇష్టపడే అప్సర వీకెండ్‌ వస్తే ట్రెక్కింగ్‌కి వెళ్తుంది. సాయంత్రం వేళ ఎత్తయిన కొండపై కూర్చుని సన్‌సెట్‌ చూడటం ఆమెకు ఇష్టం.

‘షూటింగ్‌ నుంచి విరామం వస్తే కశ్మీర్‌ వెళ్లిపోతా.. మంచు పర్వతాల్లో ఆడుకుంటూ, చలికాచుకుంటూ.. ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తా’ అని చెప్పింది.

అప్సర జంతు ప్రేమికురాలు.. పెంపుడు శునకాలకు పుట్టినరోజు వేడుకలు జరుపుతుంటుంది. ‘మనమే కాదు అవి కూడా పండగలు చేసుకోవాలి’ అనేది ఆమె ఆలోచన.

ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే అప్సర.. వీకెండ్‌లో ఎక్స్‌ట్రా ఫుడ్‌.. ఎక్స్‌ట్రా వర్కౌట్స్‌.. అంటూ రోజూ చేసే వ్యాయామం కంటే అదనంగా కసరత్తులు చేస్తుంది.

ఓల్డ్‌ + న్యూ= కొత్త రెట్రో

ముక్కు పుడక.. మస్తుంది మేడం!

బరువు సంగతి.. జిమ్‌లో చూసుకుందాంలే!

Eenadu.net Home