బాస్‌తో ఆషికా రంగనాథ్‌

‘అమిగోస్‌’తో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది.. కన్నడ భామ ఆషికా రంగనాథ్‌. తాజాగా ‘విశ్వంభర’లో అవకాశం దక్కించుకుంది. ఆమెకు వెల్‌కమ్‌ చెబుతూ చిత్ర బృందం సోషల్‌మీడియాలో పోస్టు పెట్టింది.

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రమే ‘విశ్వంభర’. భారీ బడ్జెట్‌తో వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రిష, మీనాక్షి చౌదరి, సురభి, ఇషాచావ్లా కూడా నటిస్తున్నారు. 

కల్యాణ్‌ రామ్‌ ‘అమిగోస్‌’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా.. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినా.. తన నటనకు మంచి గుర్తింపు లభించి.. అవకాశాలు వస్తున్నాయి. 

ఇటీవల నాగార్జున సరసన ‘నా సామిరంగ’లో నటించింది. చీరకట్టు, లంగా వోణీతో అందంగా కనిపించింది. ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోకపోయినా తెలుగు అభిమానుల్లో క్రేజ్‌ పెంచేసుకుంది ఆషికా.

This browser does not support the video element.

వరుసగా అగ్ర హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుంటోంది. ‘అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే నా బాధ్యతను నిర్వహిస్తాను’అంటోందీ బ్యూటీ. 

ఇటీవల కన్నడలో ‘అవతార పురుష 2’, ‘o2’లోనూ నటించింది. ప్రస్తుతం ‘గత వైభవం’, ‘విశ్వంభర’ చిత్రాల షూటింగ్‌తో బిజీ బిజీగా ఉంది.

కన్నడలో 2021లో వచ్చిన ‘మదగజ’లో పల్లవి పాత్రలో అలరించింది. ఇందులో తన నటనకు గానూ సైమా అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

This browser does not support the video element.

ఫిట్‌నెస్‌ కోసం ఎక్కువగా శ్రమిస్తుంది ఆషికా. ఒక వేళ షూటింగ్‌ సమయాల్లో కుదరకపోయినా తర్వాత మొత్తం కవర్‌ అయ్యేలా జిమ్‌ చేస్తుంది.

ఈమెకి విహార యాత్రలంటే మహా ఇష్టం. అందులోనూ మంచు ప్రదేశాలైతే ఇక చెప్పనక్కర్లేదు. మంచు చూడగానే చిన్న పిల్లనైపోతానంటోంది.

This browser does not support the video element.

ఖాళీ సమయం దొరికితే సరదాగా రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంది. తన ఇన్‌స్టా ఖాతాకి 2 మిలియన్లకి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

బోర్‌ కొడితే డ్యాన్స్‌ చేస్తుంది. సంప్రదాయ నృత్యంలోనూ ప్రావీణ్యం ఉంది. కవితలు, కథలు, కొటేషన్‌లు ఎక్కువగా చదువుతుంది.

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

Eenadu.net Home