బ్రేక్‌ వస్తే ఐలాండ్‌..

ఛాన్స్‌ వస్తే రాజమౌళి మూవీ..

‘అమిగోస్‌’తో తెలుగు తెరకు పరిచయమైన ఆషికా రంగనాథ్‌..

‘నా సామిరంగ’తో అలరించింది. చిరంజీవి ‘విశ్వంభర’లోనూ కనిపించనుంది. ‘మిస్‌ యూ’తో ఈనెల 29న అభిమానుల్ని మెస్మరైజ్ చేయబోతుంది.

కాలేజీ రోజుల్లో ‘క్లీన్ అండ్‌ క్లియర్ ఫేస్’ అందాల పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన ఆషికా.. ‘క్రేజీ బాయ్‌’లో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది.

తెలుగులో నటించింది రెండు సినిమాలే అయినా.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.


‘అక్క అనూషా రంగనాథ్‌ కూడా యాక్టరే. తను నాకు మంచి స్నేహితురాలు’అంటూ ఓ సందర్భంలో చెప్పింది. 

ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు డ్యాన్సు చేస్తుంటుంది. డ్యాన్స్ పై ఇష్టంతోనే.. బెల్లీ, వెస్ట్రన్ వంటి వాటిల్లో ప్రత్యేక కోర్సులూ చేసింది.

‘చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు, పాటలు చూస్తూ, వింటూ పెరిగా అందుకే తెలుగు భాష అంటే ఇష్టం’ అని చెప్పింది.

హిందూ సంప్రదాయాలను ఇష్టపడే ఆషికా.. ‘పండగలప్పుడు కుటుంబ సభ్యులమంతా ఒక చోట కలుస్తాం. కలసి భోంచేస్తాం. సరదాగా గడుపుతాం. అందుకే ఏ పండగనూ నేను మిస్ చేయను, ఎంజాయ్‌ చేస్తా’ అంటోంది.

ఆమె నటించిన ‘రాంబో 2’లోని ‘చుట్టు చుట్టు’సాంగ్‌ యూట్యూబ్‌లో వందమిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్న తొలి కన్నడ పాట.

కెరీర్‌ పరంగా కొత్త ప్రయత్నాలు చేస్తూ, తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ నటనలో ముందుకు సాగాలి అన్నది తన భవిష్యత్‌ లక్ష్యం.

‘ఎప్పటికైనా రాజమౌళి సినిమాలో నటించాలన్నది నా కల..’ అని ఓ సందర్భంలో తెలిపింది.

మోడ్రన్ దుస్తులు ఎన్నిఉన్నా లెహెంగా చూస్తే మనసు పారేసుకుంటా.. షాపింగ్‌కు వెళితే కొనకుండా ఆగలేను.. అంటూ వాటిపై తనకున్న ఇష్టాన్ని తెలియజేసింది.

‘ఫేవరెట్‌ ప్లేస్ మాత్రం ఐలాండ్‌. షూటింగ్ నుంచి విరామం దొరికితే.. ఏదొక ఐలాండ్‌కి వెళ్లాల్సిందే’ అంటోంది ఆషికా.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home