వరాలు.. చేతినిండా సినిమాలు..!

ఈ ఏడాది ‘నా సామిరంగ’తో వరలక్ష్మిగా సంక్రాంతి బరిలో పోటీకి దిగింది ఆషికా రంగనాథ్‌. 

ఆ చిత్రం హిట్‌ని అందించలేకపోయినా ఆమె పాత్ర మాత్రం హిట్‌ అయ్యింది. దాంతో పట్టాలెక్కిన ఆమె కెరీర్‌ ఎక్స్‌ప్రెస్‌ లాగా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.

This browser does not support the video element.

ఈ కన్నడ భామ పుట్టినరోజు సందర్భంగా ‘మిస్‌ యూ’ టీమ్‌ ఓ ప్రత్యేకమైన వీడియోని రూపొందించింది. అది చూసిన ఫ్యాన్స్‌ ‘శాండల్‌ వుడ్‌ క్వీన్‌, బ్యూటిఫుల్ ప్రిన్సెస్‌..’ అనీ కామెంట్లు చేస్తున్నారు.  

ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సినిమాలు విడుదల కాగా మరో మూడింటి షూటింగ్‌తో బిజీ బిజీగా ఉంది.

ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ‘విశ్వంభర’, తమిళంలో సిద్ధార్థ్‌తో ‘మిస్ యూ’, కన్నడలో ‘గత వైభవ’లో నటిస్తోంది.

టాలీవుడ్‌లో ‘వరాలు’గా మంచి గుర్తింపు తెచ్చుకుందీ కన్నడ బ్యూటీ. తన పేరుకంటే వరలక్ష్మిగానే గుర్తుపడతారు అభిమానులు.

ప్రకృతిలో గడపడమంటే ఆషికకు బాగా ఇష్టం. కొండలు, కోనలు, పచ్చదనం అంటూ ట్రిప్పులు ప్లాన్‌ చేస్తుంటుంది. అందులోనూ మంగళూరు మరీ ఫెవరెట్‌.

‘ఐస్‌క్రీమ్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ ఏమీ కాను. కానీ వర్షంలోనో, మంచులోనో ఉన్నప్పుడు అయితే ఐస్‌క్రీమ్ తినాల్సిందే..’ అంటోందీ బ్యూటీ.

This browser does not support the video element.

డ్యాన్స్‌ చేయడం ఈమె హాబీ.. అదే స్టేజ్‌ ఎక్కితే తనలో ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. సంతోషంగా ఫుల్‌ గ్రేస్‌తో డ్యాన్స్‌ చేస్తుందట.

‘మనం ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా.. వేళకు తినడం మాత్రం మర్చిపోకూడదు. నా మొదటి ప్రాధాన్యం ఆహారానికే ఇస్తా’ అంటోంది ఆషిక.

This browser does not support the video element.

ఈ బ్యూటీ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ ఏం కాదు. అయినా ప్రకృతిని చూస్తే క్లిక్‌మనిపించకుండా ఉండలేను అని చెబుతోంది.

కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు నచ్చిన, అక్కడ దొరికే స్పెషల్‌ వంటకాలన్నీ రుచి చూసే ఈమె దానికి తగ్గట్టే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌ కూడా చేస్తుంది. 

ఈవారం ఓటీటీ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే

నెట్‌ఫ్లిక్స్‌లో నెక్స్ట్‌ ఇవే!

సంక్రాంతి వేళ.. పోస్టర్ల కళకళ

Eenadu.net Home