టీమ్‌ ఇండియా ‘అన్న’ అశ్విన్‌

ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టు సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఎంతో ప్రత్యేకం. వందల కొద్దీ వికెట్లు.. లెక్కలేనన్ని రికార్డులు సాధించిన ఈ స్పిన్‌ దిగ్గజం.. కెరీర్‌లో వందో టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. మరి అతడి గురించి ఆస్తకిర విషయాలు తెలుసుకుందామా..

నవంబరు 6, 2011న టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొత్తం 9 వికెట్లతో తొలి మ్యాచ్‌లోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.

బ్యాటర్లను రీడ్‌ చేయడంలో దిట్ట.. అశ్విన్‌ బౌలింగ్‌ ఎదుర్కోవడం అంత సులభం కాదు. చిన్న క్లూ కూడా వదలడు. ఆరు బంతులను ఆరు రకాలుగా వేయగలిగే సత్తా అతడికుంది.

స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌లకు బౌలింగ్‌ వేయడమంటే అశ్విన్‌కు ఇష్టం.

అంతర్జాతీయ క్రికెట్‌లో కొంతమంది దిగ్గజాలకు బౌలింగ్‌ వేయకూడదు అనుకున్నాడట. వాళ్లే స్పిన్‌ ఆడటంలో మేటి అయిన ఎస్‌.బద్రీనాథ్‌, మిథున్‌ మన్‌హస్‌, రజత్‌ భాటియా.

అత్యంత వేగవంతంగా 500 టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్‌ అశ్విన్‌. ముత్తయ్య మురళీధరన్‌ మాత్రమే అశ్విన్‌ కంటే తక్కువ మ్యాచ్‌ల్లో (87) ఈ ఘనత సాధించాడు.

వందో టెస్టు ఆడుతున్న 14వ భారత ఆటగాడు అశ్విన్‌. తమిళనాడు తరఫున ఈ ఘనత సాధించిననున్న తొలి ఆటగాడు.

అశ్విన్‌ టెస్టుల్లో పదిసార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు అందుకున్నాడు. ఎనిమిదిసార్లు పది వికెట్ల ప్రదర్శన చేశాడు.

అన్ని ఫార్మాట్లు ఆడుతూ.. సుదీర్ఘకాలం నిలదొక్కుకున్న ఆటగాడు అశ్విన్‌. కొత్త వాటిని ప్రయత్నించడానికి ఏ మాత్రం భయపడడు. ఆ ప్రక్రియలో విఫలమైనా ముందుకే సాగుతాడు. 

పిచ్‌లో ఎలాంటి మ్యాజిక్‌ లేనప్పుడు అశ్విన్‌కి బంతి ఇస్తే ఆటోమేటిగ్గా వికెట్‌ పడుతుందని మాజీలు అంటుంటారు. యాష్‌ అలా చాలాసార్లు చేశాడు కూడా. 

ఇండియన్‌ క్రికెట్‌లో అశ్విన్‌ను ‘అన్న’ అని అంటుంటారు. ఆ మధ్య ఓ టెస్టులో వీరోచితంగా పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చినప్పుడు జట్టు మొత్తం ‘అన్న’ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. 

క్రికెట్‌ తప్ప అశ్విన్‌కు ఇంకే వ్యాపకమూ ఉండేది కాదు. ఇటీవల అయితే యూట్యూబ్‌ ఛానల్ పెట్టి ‘కుట్టి స్టోరీస్‌’ అంటూ క్రికెట్‌ సంబంధిత ఆసక్తికర విషయాలు, విశ్లేషణలు చెబుతున్నాడు.

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home