బౌలర్ ఆల్సో... బ్యాటర్ ఆల్సో..!
రవిచంద్రన్ అశ్విన్.. భారత క్రికెట్ జట్టులో సీనియర్ బౌలర్.. టీమ్‌ఇండియాకి అవసరమైనప్పుడు బ్యాటర్ అవతారమూ ఎత్తుతుంటాడు.
Image: RKC
తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఓటమి తప్పదనుకున్న సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ తన బ్యాటింగ్‌తో ఆదుకొన్నాడు.
Image: RKC
శ్రేయస్ అయ్యర్ (29*)తో కలిసి అశ్విన్.. అద్భుతంగా 71 పరుగుల భాగస్వామ్యం నిర్మించి భారత్‌కు విజయాన్ని అందించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Image: Twitter/BCCI
కాగా.. 9వ బ్యాటర్‌గా వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా అశ్విన్ (42 నాటౌట్) రికార్డు సృష్టించాడు.
Image: RKC
గతంలోనూ ఇలా అశ్విన్.. తనదైన శైలి బ్యాటింగ్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. 2021లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన మూడో టెస్టులో జట్టును ఓటమి నుంచి కాపాడాడు.
Image: RKC
ఆ మ్యాచ్‌లో 7వ స్థానంలో దిగిన అశ్విన్ (39*: 128 బంతులు) విహారి (23*: 161 బంతులు)తో కలిసి దాదాపు 44 ఓవర్లు క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఆసీస్‌తో ఆ మ్యాచ్ డ్రా అవడం, ఆ తర్వాతి టెస్ట్‌లో గెలవడంతో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకొంది.
Image: RKC
నిజానికి అశ్విన్ కెరీర్ బ్యాటర్‌గానే మొదలైంది. తమిళనాడు తరఫున దేశీ క్రికెట్ ఆడే సమయంలో అశ్విన్ ఓపెనింగ్ బ్యాటర్ కమ్ మీడియం పేస్ బౌలర్‌గా ఉండేవాడు.
Image: RKC
తన కోచ్ సీకే విజయ్ సూచనతో ఆఫ్ స్పిన్నర్‌గా మారాడు. అక్కడి నుంచి అశ్విన్ దశ మారింది. దేశీయ క్రికెట్‌లో సత్తా చాటి జాతీయ జట్టులోకి వచ్చాడు. టీమ్‌ఇండియా సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
Image: RKC
అశ్విన్ మొత్తంగా 88 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి.. 449 వికెట్లు పడగొట్టాడు. 3043 పరుగులు చేశాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో 400 వికెట్లు, 3 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఘనత సాధించాడు.
Image: RKC