ఆసియా కప్‌: పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం

ఆసియా కప్‌లో ఇప్పటివరకు భారత్‌, పాకిస్థాన్‌ 14 సార్లు తలపడ్డాయి. టీమ్‌ఇండియా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పాకిస్థాన్‌ 5 సార్లు గెలుపొందింది.ఒక మ్యాచ్‌ రద్దయింది.

Image:Twitter

1984లో జరిగిన ఆసియా పోటీల్లో పాక్‌పై భారత్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 1988లో జరిగిన మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థిపై టీమ్‌ఇండియా 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరేసింది.

Image:Twitter

1995లో జరిగిన పోటీల్లో భారత్‌పై పాకిస్థాన్‌ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Image:Twitter

1997 ఆసియా కప్‌ పోటీల్లో భారత్, పాక్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.

Image:Twitter

2000 సంవత్సరంలో ఆసియా కప్‌ పోటీలు బంగ్లాదేశ్ వేదికగా జరిగాయి. టీమ్‌ఇండియాపై పాకిస్థాన్‌ 44 పరుగుల తేడాతో గెలుపొందింది.

Image:Twitter 

 శ్రీలంకలో జరిగిన 2004 ఆసియా కప్‌ పోటీల్లోనూ పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ పరాజయం పాలైంది.

Image:Twitter

పాకిస్థాన్‌ వేదికగా 2008 ఆసియా కప్‌ పోటీల్లో భారత్‌, పాక్‌ రెండు సార్లు తలపడగా.. చెరో విజయం సాధించాయి.

Image:Twitter

 2010లో నిర్వహించిన పోటీల్లో పాక్‌పై టీమ్‌ఇండియా మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

Image:Twitter

బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2012 ఆసియా కప్‌ పోటీల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Image:Twitter

2014లో నిర్వహించిన ఆసియా కప్‌ పోటీల్లో టీమ్‌ఇండియాపై పాకిస్థాన్‌ ఒక వికెట్ తేడాతో నెగ్గింది.

Image:Twitter

2016 ఆసియా కప్‌ పోటీలు టీ20 ఫార్మాట్లో జరిగాయి. పాకిస్థాన్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Image:Twitter  

యూఏఈ వేదికగా నిర్వహించిన 2018 ఆసియా కప్‌ పోటీల్లో భారత్, పాక్‌ రెండుసార్లు తలపడ్డాయి. గ్రూప్‌ స్టేజీలో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమ్‌ఇండియా.. సూపర్‌ 4లో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరేసింది.

Image:Twitter  

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home