ఆసియా కప్‌.. ఇవి తెలుసా? 

ఆసియా కప్‌ని ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్ ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ కౌన్సిల్‌ని 1983లో ఏర్పాటు చేశారు.

Image:Twitter

దీంట్లో ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. వన్డేలు, టీ20ల గణాంకాల ఆధారంగా నేపాల్‌, ఒమన్, యూఏఈ అసోసియేట్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి.

Image:Twitter

ఆసియా కప్‌ మొదటి ఎడిషన్‌ని 1984లో యూఏఈ వేదికగా నిర్వహించారు. దీంట్లో భారత్, శ్రీలంక, పాకిస్థాన్‌ పాల్గొనగా.. టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది.

Image:Twitter

1985లో భారత్- శ్రీలంక మధ్య జరిగిన ఓ సిరీస్‌ వివాదస్పదమై ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో 1986లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌ పోటీల్లో టీమ్‌ఇండియా పాల్గొనలేదు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ మొదటిసారి ఆడింది.

Image:Twitter

1990-91లో ఆసియా కప్‌ పోటీలను భారత్‌లో నిర్వహించారు. మన దేశంతో రాజకీయ సంబంధాలు దెబ్బతినడంతో పాకిస్థాన్ టోర్నీ నుంచి వైదొలిగింది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ఇండియా విజేతగా నిలిచింది.

Image:Twitter 

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య రాజకీయ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 1993లో ఆసియా కప్‌ని రద్దు చేశారు.

Image:Twitter

2004 ఆసియా కప్ పోటీలకు శ్రీలంక అతిథ్యం ఇచ్చింది. యూఏఈ, హాంకాంగ్‌ జట్లు కూడా తొలిసారి పాల్గొనడంతో జట్ల సంఖ్య 6కి చేరింది. టోర్నీని (లీగ్‌ స్టేజ్‌, సూపర్‌ ఫోర్‌, ఫైనల్‌) అనే మూడు దశలుగా విభజించారు.

Image:Twitter

శ్రీలంక వేదికగా 2010లో నిర్వహించిన పోటీల్లో టెస్టులు ఆడే దేశాలు ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ మాత్రమే పాల్గొన్నాయి. లంకేయులతో జరిగిన ఫైనల్లో భారత్‌ విజయం సాధించి ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. 15 ఏళ్లలో తర్వాత భారత్‌ మళ్లీ టైటిల్‌ గెలిచింది.

Image:Twitter

2012 ఆసియా కప్‌ పోటీల్లో భారత్, శ్రీలంకను ఓడించి టోర్నీ చరిత్రలో బంగ్లాదేశ్ తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. చివరి ఓవర్‌ వరకు సాగిన ఉత్కంఠపోరులో పాక్‌ విజేతగా నిలిచింది.ఈ టోర్నీలోనే సచిన్ 100వ శతకం పూర్తిచేసుకోవడం విశేషం.

Image:Twitter

బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 ఆసియా కప్‌ పోటీల్లో అఫ్గానిస్థాన్‌ కూడా భాగం కావడంతో జట్ల సంఖ్య 5కి చేరింది. ఈ టోర్నీ చరిత్రలో అఫ్గాన్‌ పాల్గొనడం ఇదే తొలిసారి.

Image:Twitter

2016 నుంచి ఈ టోర్నీని వన్డే, టీ20 ఫార్మాట్‌ (రొటేషన్ పద్ధతి)లో నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆ సంవత్సరం మ్యాచ్‌లను పొట్టి ఫార్మాట్‌లో జరిపారు. బంగ్లాదేశ్‌తో జరిగిన తుది పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Image:Twitter

2018 ఆసియా కప్‌ ఫైనల్‌లోనూ భారత్, బంగ్లాదేశ్ తలపడ్డాయి. బంగ్లాపై టీమ్‌ఇండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఏడోసారి టైటిల్‌ని ముద్దాడింది.

Image:Twitter

2020లో నిర్వహించాల్సిన ఆసియా కప్‌ని కరోనా వల్ల 2021కి వాయిదా వేశారు. వివిధ కారణాలతో అది కాస్త 2022కి వాయిదా పడింది.

Image:Twitter 

IND vs BAN.. ఎప్పుడు, ఎక్కడ, ఎందులో?

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాతో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌!

దులీప్‌ ట్రోఫీ.. బౌలింగ్‌తో దుమ్ముదులిపేశారు!

Eenadu.net Home