ఏథర్‌ 450 అపెక్స్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 157 కిలోమీటర్లు

ఏథర్‌ సంస్థ 450 అపెక్స్‌ పేరిట కొత్త స్కూటర్‌ తీసుకొచ్చింది. బ్లూ కలర్‌లో లభ్యమవుతుంది.

 ఈ స్కూటర్‌ ధర రూ.1.89 లక్షలు. మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

 450 అపెక్స్‌లో 3.7kWh బ్యాటరీ ఇచ్చారు. సింగిల్‌ ఛార్జితో 157 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

This browser does not support the video element.

కొత్తగా మ్యాజిక్‌ ట్విస్ట్‌ అనే ఫీచర్‌ను ఇందులో తీసుకొచ్చారు. థ్రోటల్‌ను రిలీజ్‌ చేస్తే ఆటోమేటిక్‌గా బ్రేక్‌ అప్లయ్‌ అవుతుంది. 

This browser does not support the video element.

ఈ స్కూటర్‌ 2.09 సెకన్లలోనే 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 

హోమ్‌ ఛార్జర్‌తో ఛార్జ్‌ చేస్తే 0-100 శాతం ఛార్జింగ్‌ అవ్వడానికి 5.45 గంటలు పడుతుంది.

ఇందులో 17.7 సెంటీమీటర్ల TFT టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ఉంది.

గూగుల్‌ మ్యాప్‌ నావిగేషన్‌ సదుపాయం ఉంది.

ఐదేళ్లు/ 60వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో వస్తోంది.

విరాట్‌ కోహ్లీ ఐసీసీ అవార్డ్స్‌.. ఏ సంవత్సరం.. ఏది?

ఎప్పుడు.. ఏ ఛానల్‌లో?

చిత్రం చెప్పే విశేషాలు (16-12-2023/2)

Eenadu.net Home