అవతార్‌ గురించి మీకివి తెలుసా?

ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ‘అవతార్‌’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Image:SocialMedia

ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీన్ని 4కే ఫార్మాట్‌లోకి మార్చి హై డైనమిక్‌ రేంజ్‌లో తీర్చిదిద్దారు.

Image:SocialMedia

అవతార్‌.. 2009 డిసెంబర్‌ 18న విడుదలైంది. 237 మిలియన్‌ డాలర్ల (రూ.1,196 కోట్లు) బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం.. 2.80 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.13,555 కోట్లు) వసూళ్లు చేసింది.

Image:SocialMedia

నిజానికి ‘అవతార్‌’ సినిమాకు సంబంధించిన కథను కామెరూన్‌ 1994లోనే రాసుకున్నారు. 1997లో తను దర్శకత్వం వహించిన ‘టైటానిక్‌’ విడుదల చేసి ఆ తర్వాత ‘అవతార్‌’ను తెరకెక్కించాలనుకున్నారు.

Image:SocialMedia

అప్పట్లో ఈ భారీ విజువల్‌ వండర్‌ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రాలేదు. పైగా అప్పటి సాంకేతికతతో చిత్రాన్ని నిర్మించలేమని కామెరూన్‌ భావించడంతో సినిమా పట్టాలెక్కలేదు.

Image:SocialMedia

‘అవతార్‌’లో పండోరా గ్రహాన్ని రూపొందించేందుకు కామెరూన్‌ చాలా కష్టపడ్డారు. చైనా పర్వతాలు, యానిమేషన్‌లో వచ్చే ప్రదేశాలను స్ఫూర్తిగా తీసుకొని పండోరాను డిజైన్‌ చేశారట.

Image:SocialMedia

పండోరా గ్రహవాసులు మాట్లాడే ‘నేవీ’ భాషను పాల్‌ ఫ్రామర్‌ సృష్టించారు. ఇందులో వెయ్యి పదాలు ఉంటాయి.

Image:SocialMedia

షూటింగ్‌ను 2007 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఇందులో 40శాతం లైవ్‌ లొకేషన్‌లో చిత్రీకరణ జరగగా.. 60శాతం ఫొటో-రియలిస్టిక్‌ సీజీఐతోనే తీశారు. ఇందుకోసం మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని వాడారు.

Image:SocialMedia

నటీనటులు వారి పాత్రల్లో రాణించేలా కామెరూన్‌ శిక్షణ ఇప్పించారు. వారిని హువావేకి తీసుకెళ్లి అక్కడి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ చేయించారు. Image:SocialMedia

అవతార్ కోసమే 10 వేల చదరపు అడుగుల స్థలంలో 4,000 సర్వర్లు, 35 వేల ప్రాసెసర్ కోర్లతో సర్వర్ ఫాంను ఏర్పాటు చేశారట. అవుట్ పుట్ స్టోర్ చేయడానికి 3 పెటాబైట్ల డేటా (దాదాపు 30 లక్షల జీబీ) ఉపయోగించారట.

Image:SocialMedia

సినిమా కోసం ప్రత్యేకంగా కొత్త టెక్నాలజీని వాడటమే కాదు.. సంగీతం కోసం కంపోజర్‌ జేమ్స్‌ హార్నర్‌ కొత్త సంగీత వాయిద్యాలనూ సృష్టించారు.

Image:SocialMedia

అవతార్ సినిమా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ కాగా.. ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులను అందుకుంది.

Image:SocialMedia

ఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు కామెరూన్‌ 350 మిలియన్‌ డాలర్లు పారితోషికంగా తీసుకున్నారట. Image:SocialMedia

ఈ సినిమాకి 3 సీక్వెల్స్‌ తెరకెక్కిస్తున్నారు. ‘అవతార్‌: ది వే ఆఫ్ వాటర్‌’ ఈ ఏడాది డిసెంబర్‌ 16 విడుదల చేయనున్నారు. అవతార్‌ 3ని 2026లో, అవతార్‌ 4ని 2028లో విడుదల చేస్తారట.

Image:SocialMedia

యుజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ టాలీవుడ్‌లో ఎంట్రీ!

ఈషా శారీ లుక్స్‌.. సోషల్‌ మీడియా షేక్స్‌..

వన్ ఉమెన్ బ్యాండ్.. జస్లిన్‌ రాయల్‌

Eenadu.net Home