నేను ఫుడ్‌ లవర్‌ని.. నోరు కట్టేసుకోను!

అవ్‌నీత్‌ కౌర్‌ బాలీవుడ్‌లోనే కాకుండా, హాలీవుడ్‌ లోనూ సందడి చేయనుంది. టామ్‌ క్రూజ్‌ నటిస్తున్న ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’తో ప్రపంచ ప్రేక్షకులను అలరించనుంది. 

జలంధర్‌లో పుట్టిపెరిగిన అవ్‌నీత్‌ 8 ఏళ్ల వయసులో ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ మాస్టర్స్‌’తో కెరీర్‌ను ప్రారంభించింది.

అవ్‌నీత్‌ నటించిన ‘లవ్‌ ఇన్‌ వియత్నాం’ 2024 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది.

ఏ పని చేసినా పక్కా ప్రణాళికతో చేయాలనే అవ్‌నీత్‌ సోషల్‌ మీడియాలో మోస్ట్‌ స్టైలిష్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.  

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్ - 2020లో అవ్‌నీత్‌ కౌర్‌ 13వ స్థానంలో నిలిచింది. 

‘రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఎన్ని రోజులైనా జర్నీ చేస్తా’అని తన సరదా సంగతులు చెప్పింది.

‘ప్రతి శరదృతువుకి ప్రేమలో పడుతుంటా.. ఆ కాలంలో వీచే గాలి స్వచ్ఛంగా ఉండటమే కాదు.. వాతావరణమూ అందంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో తప్పక లండన్‌ వెళ్తా’ అంటోంది.

తీరిక వేళల్లో క్లాసికల్‌ డ్యాన్స్ చేసి, ఆ రీల్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంది.

‘గుర్రపు స్వారీ చేయడం ఇష్టం... షూటింగ్‌ నుంచి విరామం దొరికితే తప్పక చేస్తా.. అది నాకు రెట్టింపు ఉత్సహాన్నిస్తుంది.’అంటోంది అవ్‌నీత్ కౌర్‌. 

‘నేను ఫుడ్‌ లవర్‌ని.. ఫిట్‌నెస్‌ కోసమని నోరు కట్టేసుకోను, బాగా తింటా.. కసరత్తులు చేస్తా..’ అని చెప్పింది.

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home