ప్రయాణాల్లో వాంతులా?
ప్రయాణాల్లో పుస్తకాలు చదవొద్దు. కిటికీలోంచి దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. తగినంత గాలి తగిలేలా చూసుకోవాలి.
Source:pixabay
కారులో ముందు సీటులో కూర్చున్నప్పటి కన్నా వెనక కూర్చుంటే వాంతయ్యే అవకాశమెక్కువ. బస్సులోనూ వీలైనంతవరకు ముందు వరుసలో కూర్చోవటం మంచిది.
Source:pixabay
రైలులోనైతే రైలు కదిలే దిశవైపు ముఖం పెట్టి కూర్చోవాలి. కిటికీ పక్కన కూర్చుంటే మంచిది.
Source:pixabay
ప్రయాణానికి ముందు కడుపు నిండా తినొద్దు. ముఖ్యంగా వేపుళ్లు, మసాలా, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాల జోలికి వెళ్లొద్దు.
Source:pixabay
ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. తగినంత నీరు తాగాలి.
Source:pixabay
ప్రయాణ సమయంలో సంగీతం వినటం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇది వాంతి భావన నుంచి మనసు మళ్లేలా చేస్తుంది.
Source:pixabay
తులసి ఆకులు నమలటం వల్ల కొందరికి వాంతి భావన తగ్గే అవకాశముంది.
Source:pixabay
కారులో వెళ్లేవారు అప్పుడప్పుడు విరామం తీసుకోవటం మంచిది. కిందికి దిగి కాసేపు నడవాలి. తాజా గాలి పీల్చుకోవాలి.
Source:pixabay
దూర ప్రయాణాలకు వెళ్లేవారు ముందుగానే డాక్టర్‌ను సంప్రదించి వాంతి, వికారం తగ్గించే మందులను వెంట తీసుకెళ్లాలి.
Source:pixabay
ప్రయాణాల్లో వాంతి వచ్చినట్లుగా అనిపిస్తే నిమ్మకాయ వాసన పీలుస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ప్రయాణంలో వాంతులను నివారించవచ్చు.
Source:pixabay