‘సర్వరోగ నివారిణి’ వేప 

వేపని ఆయుర్వేదంలో అనేక ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. దీని ఆకులు, గింజలు, వేర్లు, బెరడు ఇలా ప్రతి దానిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. 

Image: Eenadu

వేప వేర్లు, బెరడుతో తయారుచేసిన పొడిని తలకు పట్టించడం వల్ల పేల బాధ తొలగిపోతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.

Image: Eenadu

వేపలోని విటమిన్‌-ఎ, సి, కెరొటినాయిడ్స్‌, లినోలియిక్‌, ఒలియిక్‌ లాంటి సమ్మేళనాలు చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తాయి.

Image: Unsplash

వేప నూనెను తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడవుగా పెరుగుతుంది. దీంతో పాటు జుట్టు చిట్లిపోవడం కూడా తగ్గుతుంది.

Image: Unsplash

వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ గుణాలున్నాయి. అందుకే దీన్ని సర్వరోగ నివారిణి అంటారు.

Image: Unsplash

వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలకు వేపతో చెక్‌ పెట్టవచ్చు. కాళ్ల పగుళ్లలో ఇన్‌ఫెక్షన్‌ తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది.

Image: Unsplash

వేపలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడతాయి.

Image: Unsplash

కాలేయం, మూత్రపిండాల నుంచి వ్యర్థ, హానికర పదార్థాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి.

Image: Eenadu

రోజూ కొద్ది మొత్తంలో వేప కషాయాన్ని తీసుకుంటే రక్తప్రసరణ మెరుగవ్వడమే కాకుండా రక్తంలో చక్కెర నిల్వలు, బీపీ కూడా నియంత్రణలో ఉంటాయి.

Image: Unsplash

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

రెయిన్‌బో డైట్‌ లాభాలివీ..!

రకరకాల పండ్లతో.. అనేక లాభాలు

Eenadu.net Home