చిన్నారులు.. జరభద్రం

పిల్లలకు ఏడాది వయసు దాటుతుండగానే నడక, మాటలు వచ్చేస్తాయి. ఇలాంటి సమయంలోనే ఇంట్లోని కొన్ని పరికరాలు వాళ్లకు ప్రమాదకరంగా మారుతాయి. అందుకే, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి. 

Image: Pixabay

పెన్నులు, పెన్సిళ్లు, బ్లేడుతో ముఖంపైన గీసుకోవడం, చెవులు, ముక్కుల్లో దూర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.

Image: Pixabay

ఇంట్లో వాటర్‌ హీటర్‌, ఇస్త్రీ పెట్టెలను ముట్టుకుంటూ ప్రమాదం కొనితెచ్చుకుంటారు.

Image: RKC

కరెంటు ప్లగ్‌లలో వేలు పెట్టడానికి, స్విచ్‌లు వేయడానికి వద్దన్నా వెళ్తారు. దీంతో కరెంట్ షాక్‌ తగిలే ప్రమాదముంది.

Image: RKC

మిక్సర్‌, గ్రైండర్లు తిరుగుతున్నపుడు చేతులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఏదైనా వస్తువును అందులో వేస్తే ప్రమాదాలు జరగొచ్చు.

Image: Pixabay

వంట గదిలోని చాకులు, ఫోర్కులు అందకుండా చూడాలి. వాటితో ఆడుకుంటూ కంట్లో పొడుచుకునే ప్రమాదముంది.

Image: Pixabay

టీవీ స్టాండ్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌ అందకుండా చూసుకోవాలి. లేకపోతే వాటిపై ఎక్కేందుకు ప్రయత్నిస్తూ మీద పడేసుకునే అవకాశముంది.

Image: Pixabay

ఫోన్లు ఛార్జింగ్‌ పెట్టినప్పుడు వాటి వైర్‌ను కొరకడం, మొబైల్‌తో ఆడటం చేస్తుంటారు. ఇది ప్రమాదకరం.

Image: Pixabay

ఇంటి ముందు నీటి సంప్‌ ఉంటే.. ఆడుకుంటూ అందులో పడే అవకాశముంది. వాటిని ఎల్లప్పుడూ మూసి ఉంచాలి.

Image: Pixabay

చిన్న పిల్లల్ని వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూసుకోవాలి. బాల్కనీ, పిట్టగోడ, మెట్లు ఎక్కి జారి పడితే ప్రమాదం.

Image: Pixabay

పెంపుడు జంతువులతో ఆడుకునే సమయంలో అవి తిన్న ఆహారం పిల్లలు తినే వీలుంది. దీంతో అనారోగ్యానికి గురికావొచ్చు. వాటికి దూరంగా చిన్నారులను ఉంచాలి.

Image: Pixabay

ఇంట్లో ఉండే పెద్ద పెద్ద ఆట వస్తువులతో ఆడుకునేటప్పుడు పెద్దలు తోడుండాలి. లేకపోతే వాటిని మీద పడేసుకొని గాయపడే అవకాశముంది.

Image: Pixabay

ఫొటోగ్రఫీ నిషేధించిన పర్యాటక ప్రాంతాలు..

మిస్‌ వరల్డ్‌ వైడ్‌ 2024.. #గుజరాత్‌ బ్యూటీ

నవ్వితే ఎన్ని లాభాలో..

Eenadu.net Home