పాటతోనే కాదు.. అందంతోనూ ఆకట్టుకుంటున్న సింగర్స్!
ధ్వని భానుశాలి
ముంబయిలో పుట్టి పెరిగిన ధ్వని.. ప్రైవేట్ ఆల్బమ్స్‌తోపాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ పాటలు పాడుతుంటుంది. ప్రభాస్ ‘సాహో’లో ‘సైకో సయ్యాన్’పాటను తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ పాడింది.
Image: Instagram
జోనితా గాంధీ
కెనడాలో పుట్టి పెరిగిన జోనిత.. ఇండియాకి వచ్చి సింగర్‌గా మారింది. 2013 నుంచి ప్రైవేట్, బాలీవుడ్ పాటలు పాడుతోన్న జోనితకు 2022లో ‘బీస్ట్’లోని ‘హలమతి హబిబో’ పాట పాపులారిటీ తెచ్చిపెట్టింది.
Image: Instagram
కనికా కపూర్
ఈ బాలీవుడ్ సింగర్.. టీ సిరీస్ వీడియో ఆల్బమ్స్‌తో పాపులారిటీ సంపాదించింది. 2012 నుంచి పలు చిత్రాల్లో పాడుతూ కెరీర్ కొనసాగిస్తోంది.
Image: Instagram
నీతి మోహన్
ఈ సింగర్ ఎక్కువగా హిందీ, తమిళ చిత్రాల్లో పాటలు పాడుతుంటుంది. తెలుగులో డబ్ చేసిన కొన్ని హిందీ సినిమాలకు ఈమె గాత్రం అందించింది. ‘సాహో’లో ‘బ్యాడ్ బాయ్’ పాట నీతి మోహనే పాడింది.
Image: Instagram
నేహా కక్కర్
‘ఇండియన్ ఐడల్’షో న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరిస్తోన్న నేహా కక్కర్.. బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ సింగర్‌గా కొనసాగుతోంది. సినిమా పాటలతోపాటు.. వీడియో ఆల్బమ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లున్నసెలబ్రిటీల్లో నేహా కూడా ఉంది.
Image: Instagram
రంజిని జోస్
తమిళనాడుకు చెందిన ఈ గాయని.. తమిళ్‌తోపాటు వివిధ భాషల్లో పాటలు పాడుతోంది. ‘మిర్చి’లో ‘బార్బీ డాల్’.. ‘దువ్వాడ జగన్నాధమ్’లో ‘సీటీమార్’పాటలు పాడింది.
Image: Instagram
రనీనా రెడ్డి
ఈమె.. ఎక్కువగా హారీస్ జయ్‌రాజ్, దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో పాటలు పాడింది. ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘మైండ్ బ్లాక్’ పాట పాడింది రనీనానే.
Image: Instagram
రిమి టామీ
ఈమె మలయాళీ సింగర్. టెలివిజన్‌లో సంగీత పోటీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తుంటోంది.
Image: Instagram
శ్రేయా ఘోషల్
దేశంలోని వివిధ భాషల్లో శ్రేయ.. 2వేలకుపైగా పాటలు పాడింది. తెలుగులో ‘ఒక్కడు’లోని ‘నువ్వేం మాయ చేశావో గానీ’ పాటతో క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. ఎన్నో మెలోడీ పాటలకు స్వరం అందించింది.
Image: Instagram
సునిధి చౌహాన్
ఈ బాలీవుడ్ సింగర్.. 13 ఏళ్ల వయసు నుంచే సింగర్‌గా రాణిస్తోంది. ఇప్పటి వరకు వందల పాటలు పాడిన సునిధి.. తెలుగులో ‘కేవ్వు కేక’లోని ‘బాబు ఏ రాంబాబు’ పాటతో అలరించింది. ‘ఎఫ్ 3’లోని ‘ఊ ఆ.. అహా అహా’ పాట పాడింది.
Image: Instagram
యోహాని
శ్రీలంకకు చెందిన ఈ యువ గాయని.. ‘మణికే మగే హితే’ పాటతో బాగా పాపులరైంది. పలు బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. రవితేజ ‘ధమాకా’లోని ‘వాట్స్ హాప్పెనింగ్’పాటను తన వెర్షన్‌లో పాడింది.
Image: Instagram