ఈ రైలు మార్గాల్లో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే..
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
(న్యూ జల్పైగుడి- డార్జిలింగ్)
ఈ మార్గంలోని అందమైన ప్రదేశాలను తిలకించేందుకు ప్రజలు రైలు మార్గాన్నే ఎంచుకుంటారు. ఎక్కువ మలుపులు తిరిగి ఉండే ఈ దారిలో టాయ్ ట్రెయిన్‌లో ప్రయాణిస్తూ.. కాంచనజంగ పర్వత అందాలు, ప్రకృతి సోయగాలను చూడొచ్చు.
Image: Twitter
కొంకణ్ రైల్వే (ముంబయి- గోవా)
కొంకణ్ రైల్వే దారి పొడవునా ఎన్నో అందమైన ప్రకృతి దృశ్యాలను మనం చూడొచ్చు. దారిలో సహ్యాద్రి పశ్చిమ కనుమలు, వంతెనలు, కొలనులు, జలపాతాలు రమణీయంగా దర్శనమిస్తాయి.
Image: Twitter
కాంగ్రా వ్యాలీ రైల్వే
(పఠాన్‌కోట్- జోగీందర్ నగర్)
పెద్దగా ఎవరికీ తెలియని అత్యంత అందమైన రైల్వే మార్గమిది. ఈ దారిలో ప్రయాణిస్తూ.. ధౌలాధర పర్వత అందాలను ఆస్వాదించొచ్చు. జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించదగ్గ ప్రాంతంగా దీన్ని చెప్పొచ్చు.
Image: Twitter
డెజర్ట్ క్వీన్ (జైసల్మేర్- జోధ్‌పుర్)
డెజర్ట్ క్వీన్ రైలు మార్గం రాజస్థాన్‌లోని థార్ ఎడారి మీదుగా వెళ్తుంది. ఎడారిలోని డ్రై ఫారెస్ట్, అందులో జీవించే ప్రాణులు, ఇసుక తిన్నెల అందాలను వీక్షించొచ్చు.
Image: Twitter
హిమాలయన్ క్వీన్ (కల్కా- సిమ్లా)
ఈ ప్రయాణం అయిదు గంటల పాటు సాగుతుంది. కల్కా నుంచి సిమ్లాకు వెళ్లే దారిలో 20 రైల్వే స్టేషన్లు, 800 వంతెనలు, 103 టన్నెల్స్, 900 మలుపులు వస్తాయి. ఎంతో సరదాగా సాగిపోతుంటుదీ ప్రయాణం.
Image: Twitter
మాతేరన్ హిల్ రైల్వే (మాతేరన్- నేరల్)
మాతేరన్ ప్రాంతంలో కాలుష్యమనేది ఉండదు. ఇక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చుతూ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చు. దారి గజిబిజిగా, వంపులుగా ఉండటం వల్ల ప్రయాణం నిదానంగా సాగుతుంది.
Image: Twitter
నీలగిరి రైల్వే (మెట్టుపాళయం- ఊటీ)
ఈ రైల్వే మార్గాన్ని 1885లో అధికారికంగా వ్యాపారాల కోసం ప్రారంభించారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ మార్గంలో వెళ్తూ.. పచ్చటి ప్రకృతి ఒడిలో ప్రయాణిస్తున్న అనుభూతిని పొందొచ్చు.
Image: Twitter
ఐలాండ్ ఎక్స్‌ప్రెస్
(కన్యాకుమారి- త్రివేండ్రమ్)
ఈ మార్గం ఇరువైపులా కొబ్బరి చెట్లు, తమిళనాడు, కేరళ సంస్కృతులు కలగలిపిన నిర్మాణాలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. ఈ ప్రయాణం తక్కువ సమయంలో ముగిసినా.. మంచి అనుభూతుల్ని మిగులుస్తుంది.
Image: Twitter
కశ్మీర్ వ్యాలీ రైల్వే (జమ్మూ- బరాముల్లా)
అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఈ రైల్వే మార్గాన్ని నిర్మించారు. గడ్డకట్టే చలిలో పర్వతాలపై నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది కాస్త సాహసోపేత ప్రయాణమనే చెప్పాలి.
Image: Twitter
అరకు వ్యాలీ రైల్వే (వైజాగ్ - అరకు)
విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే దారిలో ఎన్నో రమణీయమైన పచ్చని ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి. ఈ మార్గంలో పదుల సంఖ్యలో టన్నెల్స్, వంతెనలు దాటాల్సి ఉంటుంది.
Image: Twitter
సేతు ఎక్స్‌ప్రెస్ (మండపం- రామేశ్వరం)
ఈ మార్గంలో ప్రయాణం కూడా ఎంతో సాహసోపేతంగా ఉంటుంది. సముద్రపు వంతెనపై ప్రయాణం కాబట్టి.. కాస్త భయంగానే ఉంటుంది. ఆ భయాన్ని వదిలేసి చూస్తే.. దారి పొడవునా సముద్రపు అందాలను ఆస్వాదించొచ్చు.
Image: Twitter