ఈ జలపాతాలను చూసొచ్చారా..!

తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి అందించిన అందమైన జలపాతాలు ఎన్నో ఉన్నాయి. పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వర్షాకాలంలో వాటిని ఒకసారి చూసిరండి..!

Image: Google maps

కుంటాల 

ఆదిలాబాద్‌ జిల్లాలోని నేరేడికొండ దగ్గర్లో ఉన్న కుంటాల జలపాతం మనోహరంగా కనిపించడమే కాదు.. కొత్త అనుభూతిని అందిస్తుంది. సమీపంలోనే శివుని ఆలయం ఉంటుంది. నిర్మల్‌కు సుమారుగా 43 కి.మీ దూరంలో ఉంది.

Image: Google maps

బొగత

ఇది ములుగు జిల్లాలోని వాజేడు మండలం చెరుకుపల్లి దగ్గర్లోని చాలా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ప్రకృతితో మమేకమైనట్టు కనిపిస్తుంది. ఇక్కడ బొగటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడికి ములుగు, భద్రాచలం నుంచి రావొచ్చు.

Image: Google maps

భీమునిపాదం

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం సీతానగరం సమీపంలో ఉంటుంది. ఇక్కడ భీముని పాదంలోంచి నీరు ప్రవహిస్తుంది. ఈ జలపాతం వద్దకు వెళ్లడానికి వరంగల్‌, మహబూబాబాద్‌ నుంచి రవాణా సౌకర్యం ఉంది.

Image: Google maps

మల్లెల తీర్థం

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉంటుంది. వటవర్లపల్లికి సమీపంలో ఈ అందమైన జలపాతం ఆకట్టుకుంటుంది. అటవీ ప్రాంతంలో పర్యటకులకు ప్రకృతిని పరిచయం చేస్తుంది. ఇక్కడికి శ్రీశైలం, హైదరాబాద్‌ నుంచి చేరుకోవచ్చు.

Image: Google maps

పోచెర

ఈ జలపాతం ఆదిలాబాద్‌జిల్లాలో, నిర్మల్‌కు సమీపంలో ఉంది. ప్రకృతి ఒడిలో ఏర్పడిన ఈ జలపాతం.. వర్షాలు పడ్డప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. సమీపంలో నర్సింహ్మస్వామి ఆలయం ఉంది. నిర్మల్‌, ఆదిలాబాద్‌ నుంచి కూడా ఇక్కడికి రావొచ్చు. 

Image: Google maps

కనకాయి

కడెం నదిపై ఉన్న జలపాతం ఇది. ఆదిలాబాద్‌ జిల్లా గిర్నూర్‌ గ్రామానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడికి పర్యటకులు ఎక్కువగా వెళ్తారు. దీని దగ్గరికి వెళ్లాలంటే నిర్మల్‌, ఆదిలాబాద్‌ నుంచి రవాణా సౌకర్యం ఉంది.

Image: Google maps

పుణ్యగిరి

విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు సమీపంలో పుణ్యగిరి క్షేత్రం ఉంది. దానికి దగ్గర్లోనే ఉన్న జలపాతం మనసును దోచేస్తుంటుంది. అరకు, విజయనగరం, విశాఖ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు.

Image: Google maps

కటికి

అల్లూరి సీతారామారాజు జిల్లాలోని బొర్రాగుహలకు సమీపంలోనే ఈ జలపాతం ఉంది. విశాఖ నుంచి కిరోండల్‌ ప్యాసింజర్‌లో వెళ్లాలి. ప్రైవేటు వాహనాలు కూడా ఉంటాయి. జలపాతం దగ్గరికి కాలినడకన కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది.

Image: Google maps

కొత్తపల్లి

విశాఖపట్నం జిల్లాలో ఈ మధ్యే వెలుగుచూసిన ఎత్తైన జలపాతం ఇది. దీన్ని స్థానిక గిరిజన యువకులు గుర్తించారు. విశాఖకు 90కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశాన్ని చూడాలంటే వాహనాలతో సమీపానికి వచ్చి.. కాలి నడకన చేరుకోవాల్సిందే.

Image: Google maps

డుడుమ

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల మధ్య ఉన్న సుందరమైన జలపాతమిది. నీటితుంపరలు పర్యటకులను పరవశింపజేస్తాయి. విశాఖ నుంచి కిరోండల్‌ ప్యాసింజర్‌ రైలులో వెళ్లి..అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో జలపాతానికి చేరుకోవచ్చు.

Image: Google maps

తలకోన

ఇది చిత్తూరు జిల్లా యర్రంవారి పాలెం మండలంలో ఉంటుంది. తిరుపతి వెళ్లేవారు బస్సుల్లోంచి జలపాతాన్ని చూడొచ్చు. ఇక్కడ రకరకాల పక్షులు, జంతువులుంటాయి.

Image: Google maps

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

Eenadu.net Home