గనవి.. సొగసుల నీలవేణి..!

శాండల్‌వుడ్‌ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు టాలీవుడ్‌కు వచ్చి స్టార్స్‌ అయ్యారు. ఇప్పుడు మరో నటి తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వబోతోంది. తనే గనవి లక్ష్మణ్‌.

Image: Instagram/Ganavi Laxman

జగపతిబాబు, మమతా మోహన్‌దాస్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన ‘రుద్రంగి’తో ఈమె.. టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఈ చిత్రం జులై 7న విడుదల కానుంది.

Image: Instagram/Ganavi Laxman

ఈ బ్యూటీ కర్ణాటకలోని చిక్కమంగళూరులో పుట్టి పెరిగింది. డిగ్రీ పూర్తి కాగానే తన కిష్టమైన డ్యాన్స్‌లోనే కెరీర్‌ను ఎంచుకుంది. 

Image: Instagram/Ganavi Laxman

బెంగళూరులో డ్యాన్స్‌ టీచర్‌గా కొన్నాళ్లు పని చేసింది. ఈ క్రమంలో సినీనటులు పరిచయం కావడంతో తనకూ నటి అవ్వాలన్న కోరిక కలిగిందట. 

Image: Instagram/Ganavi Laxman

మొదట్లో కొన్ని బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లోనూ నటించింది. సినిమాల్లో అవకాశం కోసం చాలా ఆడిషన్స్‌లో పాల్గొంది.

Image: Instagram/Ganavi Laxman

రిషభ్‌ శెట్టి దర్శకత్వం వహించిన హిట్‌ సినిమా ‘కిరాక్‌ పార్టీ’లో హీరోయిన్‌ పాత్ర కోసం ఆడిషన్‌ ఇచ్చిందట. కానీ, ఎంపిక కాలేదు. ఆ సినిమాతోనే రష్మిక మందనా ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా మారింది. 

Image: Instagram/Ganavi Laxman

ఆ సినిమా అవకాశం చేజారినా నిరాశపడి ప్రయత్నాలు ఆపలేదు. ఈ క్రమంలోనే బుల్లితెరపై నటించే అవకాశమొచ్చింది. 

Image: Instagram/Ganavi Laxman

అలా తొలిసారిగా ‘మగలు జానకి’ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించి నటిగా మారింది. ఆ సీరియల్‌తో టీవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 

Image: Instagram/Ganavi Laxman

పోయిన చోటనే సాధించాలన్నట్టు తిరిగి రిషభ్‌ శెట్టి నటించిన ‘హీరో’లో ఛాన్స్‌ దక్కించుకుంది. ఈ చిత్రం హిట్‌ కావడంతో గనవికి గుర్తింపు లభించింది. 

Image: Instagram/Ganavi Laxman

ఆ తర్వాత ‘భవచిత్ర’, శివరాజ్‌కుమార్‌ ‘వేద’లోనూ నటించి.. స్టార్‌గా ఎదుగుతోంది. ‘రుద్రంగి’తో తెలుగులోనూ తన ప్రతిభ చాటుకునేందుకు సిద్ధమవుతోంది. 

Image: Instagram/Ganavi Laxman

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home