‘కల్కి’లో కేరళ కుట్టి

ఇప్పటికే చాలా మంది కేరళ తారలు టాలీవుడ్‌ వెండితెరపై మెరిశారు. ఇప్పుడు మరో భామ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తనే.. అనా బెన్‌.

ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వస్తోన్న ‘కల్కి 2898 ఎ.డి’లో ఈ బ్యూటీ ‘కైరా’ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది. 

ఇటీవల అనా బెన్‌ ఫస్ట్‌ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘ది లక్కీ రెబల్‌’గా పేర్కొంది. దీంతో ఈమె గురించి నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

మలయాళంలో భారీ విజయాలు అందుకున్న ‘కుంబలంగి నైట్స్‌’ ‘హెలెన్‌’, ‘కప్పెల’ చిత్రాల్లో నటించింది తనే. తొలినాళ్లలోనే కేరళ స్టేట్ అవార్డులతో పాటు అనేక అవార్డులు గెలుచుకుంది. 

కేవలం మూడు చిత్రాలతోనే కేరళలో ఈమె తెచ్చుకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆమె అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అవకాశాలు క్యూ కట్టాయి. 

This browser does not support the video element.

అనా బెన్‌ పుట్టి పెరిగింది.. కేరళలోని కొచ్చిలో. సెయింట్‌ థెరిసా కాలేజ్‌లో ఫ్యాషన్‌ అండ్‌ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి నయరమ్‌బలమ్‌.. మాలీవుడ్‌లో ఫేమస్‌ స్క్రీన్‌రైటర్‌.

తండ్రి పరిశ్రమలోనే ఉండటంతో డిగ్రీ తర్వాత సినిమాని కెరీర్‌గా ఎంచుకుంది. అలా 2019లో ‘కుంబలంగి నైట్స్‌’తో తెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత ‘హెలెన్‌’, ‘కప్పెల’, ‘సారాస్‌’, ‘నారదన్‌’, ‘నైట్‌ డ్రైవ్‌’, ‘కాప’, ‘త్రిశంఖు’ తదితర చిత్రాల్లో నటించింది. ‘కొట్టుక్కాలి’తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 

ఇప్పుడు ‘కల్కి’తో తెలుగుతోపాటు పాన్‌ ఇండియా లెవల్‌లో ఆకట్టుకోబోతోంది. కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, ప్రభాస్‌, దీపికా వంటి స్టార్స్‌ ఉన్న చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు సంబరపడుతోంది. 

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. చీరకట్టు, విహారయాత్రలంటే ఎంతో ఇష్టం. ప్రత్యేక సందర్భాల్లో చీరకట్టడం, వీలు చిక్కితే కొత్త ప్రాంతాలకు వెళ్లడం చేస్తుంటుంది.

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home