చాక్లెట్స్ తింటున్నారా? వాటి ప్రయోజనాలు తెలుసా?
చాక్లెట్స్ మెదడులోని సెరటోనిన్ హార్మోన్ స్థాయుల్ని పెంచి మనలోని ఆందోళనను తగ్గించి.. సంతోషాన్ని కలిగిస్తాయి.
Image: Eenadu
డార్క్ చాక్లెట్‌లోని ‘ఎల్-అర్జినైన్’ అనే అమైనో ఆమ్లం లైంగిక కోరికల్ని పెంచుతుంది.
Image: Pixabay
100 గ్రాముల డార్క్ చాక్లెట్‌లో 11 గ్రాముల ఫైబర్ ఉంటుంది, ఇందులో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి.
Image: Pixabay
శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేసి రక్తపోటును నియంత్రిస్తాయి. దీంతో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
Image: Pixabay
చాక్లెట్స్ తింటే శరీరంలోని కొవ్వు తగ్గుతుందట. ఇందులోని ప్లాంట్ స్టెరోల్స్, కొకోవా ఫ్లేవనాయిడ్స్ కొవ్వును తగ్గించడంలో సాయపడతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
Image: Eenadu
చాక్లెట్స్‌లోని ఫ్లేవనాయిడ్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి.
Image: Eenadu
తక్షణ శక్తి పొందాలంటే చాక్లెట్స్ తినొచ్చు. వీటిలోని పోషకాలు వెంటనే శరీరానికి శక్తినిస్తాయి.
Image: Pixabay
వారానికి ఒకట్రెండు సార్లు చాక్లెట్స్ తింటూ ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
Image: Pixabay
గర్భిణులు చాక్లెట్స్ తినడం వల్ల పిండం ఆరోగ్యంగా ఉండటంతోపాటు గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయట.
Image: Pixabay