కరివేపాకే కదా అని తీసిపారేయకండి!

కరివేపాకులో ప్రొటీన్లు, మినరల్స్‌, ఐరన్‌ ఉండటంతో రక్తహీనత సమస్య ఉత్పన్నం కాదు.

Source: Pixabay

క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే.. దీనిలోని విటమిన్‌-ఎ వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఆకుల వాసన చూడటం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.

Source: Pixabay

ఈ ఆకులు మధుమేహుల్లో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.

Source: Pixabay

బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామంతోపాటు రోజూ గుప్పెడు తాజా కరివేపాకు తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. ఈ ఆకుల్లోని ‘కార్బొజోల్‌ ఆల్కలాయిడ్స్‌’ ఇందుకు ఉపయోగపడతాయి.

Source: Pixabay

ఇందులో ఉన్న పీచుపదార్థం మలబద్ధక సమస్యను నివారిస్తుంది. క్యాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది.

Source: Pixabay

గర్భిణులు ఈ ఆకులను ఆహారంలో భాగం చేసుకుంటే వాంతులు వికారం తగ్గడమే కాకుండా రక్తహీనత సమస్య రాకుండా చూసుకోవచ్చు.

Source: Pixabay

కరివేపాకును రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు జుట్టు నెరవకుండా ఇది అడ్డుకుంటుంది.

Source: Pixabay

కరివేపాకు వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే అల్జిమర్స్‌ లాంటి వ్యాధులు రాకుండా ఇది రక్షణ కల్పిస్తుంది.

Source: Pixabay

కరివేపాకులోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు చక్కటి రక్షణ కల్పిస్తాయి.

Source: Pixabay

ఆడవారిలో రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు, విరేచనాలు, గనేరియా, ఒళ్లు నొప్పులు తగ్గించడానికి కరివేపాకు పనికొస్తుంది.

Source: Pixabay

మామిడి పండు తింటే మొటిమలు వస్తాయా..!

పుచ్చకాయతో లాభాలెన్నో...

మే 17న హైపర్‌ టెన్షన్‌ డే

Eenadu.net Home