సైకిల్‌ తొక్కితే లాభాలెన్నో..

(జూన్‌ 3 వరల్డ్‌ సైకిల్‌ డే)

సైకిల్‌ తొక్కడం వల్ల శరీరంలోని కండరాలు దృఢంగా మారుతాయి. శరీరం యవ్వనంగా కనిపిస్తుంది.  

ఓ గంట సైకిలు తొక్కితే కనీసం 300 కేలొరీలు ఖర్చవుతాయి. కొలెస్ట్రాల్‌ కరిగి.. బరువు తగ్గుతారు.

జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రతా, చురుకుదనం కూడా పెరుగుతాయి. 

సైకిల్‌ తొక్కుతూ ఉంటే స్వేద‌రంధ్రాల ద్వారా మృత‌క‌ణాలు బయటకు పోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.

శరీర అవయవాల మధ్య సమన్వయం అభివృద్ధి చెందుతుంది. ప్రతిస్పందనలు తొందరగా జరుగుతాయి.

ఉత్సాహం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయి. డిప్రెషన్‌ లక్షణాలు ఉంటే తగ్గుతాయి.

రోజుకు కనీసం 4 కి.మీ మేర సైకిల్‌ తొక్కితే శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదాలు తగ్గుతాయి.

తరచూ సైకిల్‌ తొక్కడం ద్వారా క్యాన్సర్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పలు పరిశోధనలు చెబుతున్నాయి. 

ఆఫీసు, కిరాణా షాపు, పార్క్‌ ఇలా సమీపంలో ఉండే ఏ ప్రదేశానికైనా సైకిల్‌పై వెళ్లడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ పానీయాలు ట్రై చేయండి

విరాట్‌ అనుసరిస్తున్న హిట్‌ ఎక్సర్‌సైజ్‌..

ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తున్నారా?

Eenadu.net Home