ధ్యానం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

ధ్యానం చేయడం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి, భయాలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.

Source: Pixabay

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మతిమరుపు దరి చేరదు.

Source: Pixabay

ధ్యానం వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వస్తుంది.

Source: Pixabay

ధ్యానంతో శరీరంలోని కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. దీంతో నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. గాయాలయితే త్వరగా తగ్గిపోతాయి.

Source: Pixabay

ధ్యాన సాధన చేస్తే రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. మనోవైకల్యం, గుండెజబ్బులు రావు.

Source: Pixabay

ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. జ్ఞానం బోధపడుతుంది. జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించగలుతారు.

Source: Pixabay

ధ్యానం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి లభిస్తుంది. కోపాన్ని అదుపు చేసుకోవచ్చు.

Source: Pixabay

ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే.. తప్పనిసరిగా ధ్యానం చేయాలని పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు చెబుతుంటారు. మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలపాటు ప్రతి రోజు ధ్యానం చేయాలి.

Source: Pixabay

ఈ వారం రాశిఫలం

నూతన సంవత్సరం ఒక్కో చోట ఒక్కోలా..

అష్టదిగ్గజములు అంటే ఎంటో తెలుసా?

Eenadu.net Home