విశ్వ సుందరికి లభించే సౌకర్యాలివీ!
తాజాగా జరిగిన అందాల పోటీలో అమెరికాకు చెందిన ఆర్ బానీ గాబ్రియేల్ ‘మిస్ యూనివర్స్ -2022’గా నిలిచింది. మరి మిస్ యూనివర్స్ విజేతకు ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో చూద్దామా..
Images: Instagram/miss universe
మిస్ యూనివర్స్‌గా నిలిచిన వారికి దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది.
Images: Instagram/rbonneynola
వీరికి న్యూయార్క్ నగరంలోని మిస్ యూనివర్స్ అపార్ట్‌మెంట్‌లో ఏడాది పాటు ఉచిత నివాస సౌకర్యం ఉంటుంది. అందులో ఉన్నన్ని రోజులు వంటింటి సరుకుల నుంచి వేసుకునే దుస్తుల వరకు అన్నీ ఉచితం.
Images: Instagram/rbonneynola
విశ్వసుందరిగా నిలిచిన వారు ఏడాది పాటు ప్రత్యేక విమానంలో ప్రపంచమంతా ఉచితంగా చుట్టి రావచ్చు. దీనికయ్యే ప్రయాణం, హోటల్, రెస్టారంట్ల ఖర్చులను మిస్ యూనివర్స్ సంస్థే భరిస్తుంది.
Images: Instagram/rbonneynola
ఈ అందాల పోటీలో విజేత.. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్‌కు సంవత్సరం పాటు చీఫ్ అంబాసిడర్‌గా కొనసాగుతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ నిర్వహించే పలు సామాజిక కార్యక్రమాలు, పార్టీలు, ప్రెస్ కాన్ఫరెన్సులకు హాజరవ్వాల్సి ఉంటుంది.
Images: Instagram/rbonneynola
మిస్ యూనివర్స్‌కు మేకప్ ఆర్టిస్ట్, కొంతమంది సిబ్బందిని ఉచితంగా నియమిస్తారు. మేకప్‌కు కావాల్సిన ఉత్పత్తులు, దుస్తులు, ఆభరణాలు, పాదరక్షలు.. ఇలా అన్నింటి ఖర్చూ ఆ సంస్థే భరిస్తుంది.
Images: Instagram/rbonneynola
విశ్వసుందరి కోసం ఆ సంస్థ ప్రొఫెషనల్ స్టైలిస్ట్, న్యూట్రిషనిస్ట్, డెర్మటాలజిస్ట్, డెంటిస్ట్‌లను నియమిస్తుంటుంది. ఫొటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. మోడలింగ్, సినిమా రంగాల్లో రాణించాలనుకుంటే.. ఈ ఫొటోగ్రాఫర్స్‌తో ఉచితంగా ఫొటోషూట్స్ చేయించుకోవచ్చు.
Images: Instagram/rbonneynola
ప్రపంచంలో ఎక్కడ పార్టీలు, కార్యక్రమాలు, సినిమా స్క్రీనింగ్‌లు జరిగినా.. విశ్వసుందరికి ఆహ్వానం ఉంటుంది.
Images: Instagram/rbonneynola
ఈసారి మిస్ యూనివర్స్‌గా నిలిచిన ఆర్ బానీ గాబ్రియేల్.. అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించింది. మోడల్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తోంది.
Images: Instagram/rbonneynola