పెంపుడు జంతువులు.. ఎన్నో లాభాలు!

పెంపుడు జంతువులతో ఆడుకుంటే చాలా సరదాగా ఉంటుంది. వాటితో కేవలం కాలక్షేపమే కాదు.. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసా? 

Image: Pixabay

ఒత్తిడి, ఆందోళనతో ఉన్న వారు పెంపుడు జంతువుతో కాసేపు ఆడుకుంటే.. ఒత్తిడి నుంచి ఉపశమనం, మనసుకు ప్రశాంతత లభిస్తాయి. 

Image: RKC

ఇంట్లో పెంపుడు జంతువుంటే.. చిన్నారులు వాటితో ఆడుకుంటూ.. జాగ్రత్తగా చూసుకుంటూ బాధ్యతల గురించి తెలుసుకుంటారు. 

Image: RKC

పెంపుడు జంతువులు బయట ఆడుకుంటున్నప్పుడు వాటికి ఎన్నో సూక్ష్మక్రిములు అంటుకుంటాయి. అవి మనుషుల రోగనిరోధక శక్తిని పెంచి దగ్గు, జలుబు నుంచి కాపాడతాయి. 

Image: RKC

శునకాలు వాకింగ్‌ వెళ్లడానికి ఇష్టపడతాయి. అవి ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్‌కు తీసుకెళ్లాల్సిందే. దీంతో యజమానికి కూడా వాకింగ్‌ చేసినట్లు అవుతుంది.. ఫిట్‌నెస్‌ పెరుగుతుంది. 

Image: RKC

ఒంటరిగా ఉండేవాళ్లకు పెంపుడు జంతువులు మంచి స్నేహితులు. మనుషుల భావోద్వేగాలను అవి చక్కగా అర్థం చేసుకోగలవు. వాటితో సమయం గడిపితే ఒంటరితనం దూరమవుతుంది. 

Image: RKC

చిన్నారుల్లో వచ్చే కొన్ని రకాల ఎలర్జీలను శునకాల రోమాలు నివారిస్తాయట. 

Image: RKC

పెంపుడు జంతువులు యజమాని పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఇంటికి కాపలా కాస్తూ రక్షణ కల్పిస్తాయి. 

Image: RKC

ఆటిజంతో బాధపడే పిల్లలకు ఇవి తోడుగా నిలుస్తాయి. వాళ్లు పదే పదే చెప్పే మాటల్ని ఓపిగ్గా వింటాయి. వారితో కలిసి ఆడుకుంటాయి.

Image: RKC

ఫొటోగ్రఫీ నిషేధించిన పర్యాటక ప్రాంతాలు..

మిస్‌ వరల్డ్‌ వైడ్‌ 2024.. #గుజరాత్‌ బ్యూటీ

నవ్వితే ఎన్ని లాభాలో..

Eenadu.net Home