పీపీఎఫ్‌ ఖాతా ప్రయోజనాలు తెలుసా?

దేశంలోని అన్ని వర్గాల ప్రజలు పెట్టుబడి పెట్టగలిగే ప్రభుత్వ పథకం.. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌).

Source: Eenadu

పీపీఎఫ్‌ను కేంద్ర ప్రభుత్వం 1968లో ప్రవేశపెట్టింది. దీని ద్వారా క‌చ్చిత‌మైన రాబ‌డిని పొంద‌డంతోపాటు పెట్టుబ‌డుల‌కు భద్రత ఉంటుంది.

Source: Eenadu

ఈ ఖాతాను రూ. 500తో ప్రారంభించొచ్చు. ఏడాదికి గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్షల వరకు పెట్టుబ‌డి పెట్టొచ్చు.

Source: Eenadu

పెట్టుబ‌డి మెచ్యూరిటీ కాలం 15 సంవ‌త్సరాలు. మెచ్యూరిటీ తర్వాత కూడా ఈ ఖాతాను 5 ఏళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.

Source: Pixabay

పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే.. పీపీఎఫ్‌ ఖాతా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.

Source: Eenadu

పీపీఎఫ్ ఖాతా వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి త్రైమాసికానికి ప్రభుత్వం వ‌డ్డీ రేట్లను స‌వ‌రిస్తుంది.

Source: Eenadu

ఈ ఖాతా రుణ స‌దుపాయాన్ని అందిస్తుంది. పెట్టుబ‌డిదారుడు ఖాతాలో జ‌మ‌చేసిన మొత్తంలో 25 శాతం లేదా అంత‌కంటే త‌క్కువ మొత్తాన్ని రుణంగా తీసుకునే అవ‌కాశం ఉంది.

Source: Eenadu

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్షన్‌ 80సి కింద గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్షల వ‌ర‌కు పన్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తించ‌దు.

Source: Eenadu

పీపీఎఫ్ ఖాతాదారు దివాళా తీసినా లేదా రుణాలు చెల్లించ‌డంలో విఫ‌లమ‌యినా వారు బాకీ ఉన్న మొత్తానికి పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని 'ఎటాచ్' చేయటం వీలు కాదు.

Source: Pixabay

ట్రేడింగ్‌ చేస్తున్నారా? ఈ టిప్స్‌ ఫాలోకండి!

ఆర్థిక లక్ష్యం చేరుకోవడం ఎలా?

ఏటీఎం ఛార్జీలు తప్పించుకునే మార్గాలు!

Eenadu.net Home