సేవింగ్స్‌ అకౌంట్‌ ప్రయోజనాలేంటో తెలుసా?

షేర్స్‌, ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి అధిక లాభం ఆర్జించొచ్చని చాలా మంది సేవింగ్స్‌ అకౌంట్స్‌లో పొదుపు చేయడం మానేస్తున్నారు. కానీ, సేవింగ్స్‌ అకౌంట్‌తోనూ కొన్ని ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..

Image: Unsplash

సేవింగ్స్‌ అకౌంట్‌లో మీరు జమ చేసిన నగదుకు పూర్తి రక్షణ ఉంటుంది. అందులో డబ్బు జమ చేసి నిశ్చింతగా ఉండొచ్చు.

Image: Eenadu

ఇతర మార్గాలతో పోలిస్తే సేవింగ్స్‌ ఖాతాలో ఉన్న డబ్బుకి వచ్చే వడ్డీ తక్కువే. అయినా.. స్థిరమైన ఆదాయం ఉంటుంది. రాబడిపై ఆందోళన పడనక్కర్లేదు.

Image: Eenadu

చేతిలో డబ్బు ఉంటే ఖర్చయిపోతుంది. అదే సేవింగ్స్‌ అకౌంట్‌లో పొదుపు చేస్తే మీకు అవసరమైనప్పుడే డబ్బు తీసుకోవచ్చు. దీంతో మీకు ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది.

Image: Eenadu

ప్రతి నెల మీ సేవింగ్స్‌ ఖాతాలో డబ్బును పొదుపు చేస్తున్నప్పుడు బ్యాంకులకు మీపై నమ్మకం పెరుగుతుంది. క్రెడిట్‌ కార్డు, లోన్స్‌ సులభంగా మంజూరు చేస్తాయి.

Image: Eenadu

సేవింగ్స్‌ ఖాతాకు ఇచ్చే డెబిట్‌కార్డుతో మీరు సులభంగా కొనుగోళ్లు జరపొచ్చు. ఈ-వాలెట్స్‌లోకి నగదును బదిలీ చేసుకోవచ్చు.

Image: Eenadu

ప్రతి నెల ఈఎంఐలు సహా అనేక బిల్లుల్నిసేవింగ్స్‌ ఖాతా ద్వారా చెల్లించొచ్చు. ఇందుకోసం మీ ఖాతాలో ఆటోమేటెడ్‌ బిల్‌ పేమెంట్స్ సర్వీస్‌ను యాక్టివేట్‌ చేసుకుంటే సరిపోతుంది.

Image: Eenadu

మీ ఆదాయం మొత్తాన్ని సేవింగ్స్‌ అకౌంట్‌లో పొదుపు చేస్తుంటే.. ఆదాయపు పన్ను రిటర్న్స్‌ చెల్లింపు లెక్కలు సులభమవుతాయి.

Image: Eenadu

ప్రతి వ్యక్తి రెండు సేవింగ్స్‌ అకౌంట్స్‌ తెరిచి.. ఒక దాన్ని నెలవారీ బిల్లుల చెల్లింపుల కోసం, మరోదాన్ని పొదుపు కోసం ఉపయోగిస్తే.. ఆర్థిక నిర్వహణ సులభంగా ఉంటుంది.

Image: Eenadu

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home