టీ బ్యాగ్స్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు!
టీ బ్యాగ్స్ కేవలం టీ తయారు చేసుకోవడానికే కాదు.. మరెన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఎలాగంటే..
Image: RKC
నిద్రలేమితో కళ్ల కింద చర్మం ముడతలు పడతాయి. అలాంటప్పుడు వాడేసిన టీ బ్యాగ్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టి.. చల్లబడ్డాక కళ్లపై పెట్టుకోవాలి. దీంతో కళ్లు రిలాక్స్ అవడంతోపాటు ముడతలు తగ్గుముఖం పడతాయి.
Image: RKC
వాడేసిన టీ బ్యాగ్‌ను ఫేస్ స్క్రబర్‌గా వాడుకోవచ్చు. దీనితో చర్మంపై మసాజ్ చేసుకుంటే మలినాలు తొలగడంతోపాటు రంధ్రాలు మూసుకుపోయే అవకాశముంది.
Image: RKC
చర్మంపై దద్దుర్లు, దురద వంటికి వచ్చినప్పుడు బ్లాక్ టీ బ్యాగ్‌తో చర్మంపై మర్దన చేసుకుంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
Image: RKC
చిన్న చిన్న గాయాలు మానడానికి టీ బ్యాగ్స్ సాయపడతాయి. టీ బ్యాగ్‌ను ఆవిరిలో పెట్టి.. చల్లారాక గాయంపై కొన్ని నిమిషాలపాటు ఉంచితే.. నొప్పి, గాయం తగ్గిపోతాయి.
Image: RKC
చెక్క వస్తువుల్ని టీ బ్యాగ్స్‌తో మెరిసిపోయేలా చేయొచ్చు. ఇందుకోసం మొదట టీ బ్యాగ్స్‌ను వేడి నీళ్లలో వేసి.. తర్వాత వాటితో చెక్క వస్తువులను పాలిష్ చేయాలి.
Image: RKC
కిటికీలు, గ్లాస్ అద్దాలు కూడా తడి టీ బ్యాగ్స్‌తో తుడిచి.. ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిస్తే తళతళమని మెరిసిపోతాయి.
Image: RKC
టీ బ్యాగ్స్‌లోని మిశ్రమాన్ని నీళ్లలో కలిపి ఇంటి పెరట్లో పోస్తే.. భూమి సారవంతంగా మారుతుంది. చెట్లకు ఎరువుగానూ ఉపయోగపడుతుంది.
Image: RKC
చేతులకు అంటిన మాంసం, ఉల్లిపాయ వంటి వాసనను టీ బ్యాగ్ పోగొడుతుంది. చేతుల్ని శుభ్రం చేసుకునే ముందు టీ బ్యాగ్‌లోని మిశ్రమాన్ని చేతులకు రుద్దుకొని.. సబ్బుతో కడిగేస్తే సరి.
Image: Pixabay
టీ బ్యాగ్‌ను వేడి నీళ్లలో వేసి.. ఆ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. ఆ తర్వాత షాంపూతో స్నానం చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంగా.. మెరుస్తూ ఉంటాయి.
Image: RKC