ఈసారైనా అదృష్టం కలిసొచ్చేనా..!
‘అలనాటి రామచంద్రుడు’తో బెంగాలీ బ్యూటీ మోక్ష టాలీవుడ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఆకాశ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథా చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఇందులో మోక్ష ధరణి పాత్రలో అలరించనుంది.
‘ఐహేట్ యూ’, ‘నీతోనే నేను’, ‘కర్మ’, ‘లక్కీ లక్ష్మణ్’ వంటి చిత్రాల్లో నటించింది.
ఎన్ని సినిమాలు చేసినా మోక్ష కెరీర్‌ను మలుపు తిప్పే హిట్‌ను మాత్రం అందుకోలేకపోయింది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు అభిమానుల నుంచి వస్తోన్న స్పందనతో తెలుగులో ఈ చిత్రం హిట్నిస్తుందని ఆశలు పెట్టుకుంది మోక్ష.
ఈ బ్యూటీ విషయానికొస్తే పశ్చిమబెంగాల్లోని బరఖ్పుర్లో పుట్టింది. కోల్‌కతాలో సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.
This browser does not support the video element.
ఈమె అసలు పేరు ప్రీతా సేన్ గుప్తా. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాతే మోక్షగా పేరు మార్చుకుంది.
మోక్ష టీచర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది. నటన మీద ఉన్న ఆసక్తితో 2019లో బెంగాల్లో ‘ఫిల్టర్ కాఫీ లిక్కర్ ఛ’ ద్వారా తెరపై ఎంట్రీ ఇచ్చింది.
కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంది. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, డ్యాన్స్ చేయడం ఈ బ్యూటీ హాబీలు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందీమె. ఇన్‌స్టాలో 2లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
This browser does not support the video element.
చిన్న వయసు నుంచే సంప్రదాయ నృత్యంపై ఉన్న ఇష్టంతో కథక్, భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది.