శాండల్‌వుడ్‌ బ్యూటీ.. రాజ్‌తరుణ్‌తో తెలుగులో ఎంట్రీ!

‘భలే ఉన్నాడే’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది బెంగళూరు బ్యూటీ మనీషా కంద్కూర్‌. 

ఇందులో రాజ్‌తరుణ్‌ హీరో. ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. జె. శివసాయి వర్దన్‌ దర్శకత్వం వహించారు.

మనీషా కన్నడ అమ్మాయి. బెంగళూరులో పుట్టింది. అయినా తెలుగులో మొదటి సినిమాకే డబ్బింగ్‌ చెప్పి వహ్వా.. అనిపించుకుంటోంది.

నటన మీద ఆసక్తితో పరిశ్రమలోకి వచ్చింది. ‘మొదటి సినిమాలోనే హీరోయిన్‌ పాత్రకు ఇంత ప్రాధాన్యం ఉన్న అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది’ అని అంటోందీ బ్యూటీ.

ఈమెకి కొత్త ప్రదేశాలను చుట్టేయడమంటే చాలా ఇష్టం. ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.

మనీషాకు మూగ జీవాలంటే ఎంతో ప్రేమ. అన్నట్టు తనకు ఒక పెంపుడు శునకం కూడా ఉంది. అది అంటే తనకెంతో ఇష్టం. 

‘ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతను అందించేందుకు యోగా, ధ్యానం వంటివి చక్కగా దోహదపడతాయి’ అని చెబుతోంది. 

ఎక్కువగా ప్రకృతిలో గడపడానికి ఇష్టపడుతుంది. ‘సరదాగా బీచ్‌లో ఆడుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది. ఖాళీ సమయం దొరికితే బీచ్‌కే పరుగులు తీస్తాను’ అంటోంది.

ఆకలిగా ఉంటే ఏ ఫుడ్‌ అయినా లాగించేస్తుందట. అందులోనూ నూడుల్స్‌, కేక్‌ వంటివి మహా ఇష్టం.

ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, పాటలు వినడం, స్నేహితులతో షికార్లు కొట్టడానికి ఇష్టపడుతుంది. 

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home