2023లో బిగ్‌ బైక్స్‌ సందడి

కుర్రకారును ఆకట్టుకునేలా ఈ ఏడాది అనేక బైక్స్‌ సందడి చేశాయి. 200 సీసీ+ సామర్థ్యంతో అనేక బైక్స్‌ వచ్చాయి.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 450

నవంబర్‌లో ఈ బైక్‌ లాంచ్‌ అయ్యింది. 451 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ మోటార్‌ సైకిల్‌ ధర రూ.2.69 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌) నుంచి ప్రారంభం.

ట్రయంఫ్‌ స్పీడ్‌ 400

దేశీయ కంపెనీ బజాజ్‌తో కలిసి ట్రయంఫ్‌ మోటార్‌ సైకిల్‌ స్పీడ్‌ 400ను లంచ్‌ చేసింది. 398 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ ధర రూ.2.33 లక్షలు.

ట్రయంఫ్‌ స్క్రాంబ్లర్‌ 400X

బజాజ్‌ - ట్రయంఫ్‌ భాగస్వామ్యంలో వచ్చిన మరో బైక్‌ ఇది. 398 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ ధర రూ.2.63 లక్షలు.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350

బుల్లెట్‌ బ్రాండ్‌ నేమ్‌తో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి వచ్చిన బైక్‌ ఇది. దీని ధర రూ.1.74 లక్షల నుంచి ప్రారంభం. క్లాసిక్‌ లుక్‌లో వచ్చిన ఈ బైక్‌ మూడు రంగుల్లో లభ్యం.

కేటీఎం 390 డ్యూక్‌

సెప్టెంబర్‌లో 390 డ్యూక్‌ను కేటీఎం విడుదల చేసింది. దీని ధర రూ.3.10 లక్షల నుంచి ప్రారంభం. ఇందులో 399 సీసీ ఇంజిన్‌ ఉంది.

హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌440

హీరో - హార్లే భాగస్వామ్యంలో జులైలో దీన్ని లాంచ్‌ చేశారు. ఈ బైక్‌ ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభం. ఇందులో 440 సీసీ ఇంజిన్‌ ఉంది.

హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌ 210

హీరో ఐకానిక్‌ మోడల్‌ కరిజ్మా పేరుతో XMR 210ను తీసుకొచ్చింది. దీని ధర రూ.1.72 లక్షలు.

ఏప్రిలియా RS 457

ఏప్రిలియా ఇండియా నుంచి డిసెంబర్‌లో విడుదలైన స్పోర్ట్స్‌ బైక్‌ ఇది. దీని ధర రూ.4.19 లక్షలు.

హోండా సీబీ350

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ లుక్‌తో హోండా తీసుకొచ్చిన బైక్‌ ఇది. ఇందులో 348 సీసీ ఇంజిన్‌ అమర్చారు. దీని ధర రూ.1.86 లక్షలు

డ్రై ప్రమోషన్‌.. కాఫీ బ్యాడ్జింగ్‌.. ఈ ట్రెండ్స్‌ తెలుసా?

మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్‌ విశేషాలివీ..

ఉద్యోగంలో భవిష్యత్తునిచ్చే టాప్‌ 10 కంపెనీలివీ!

Eenadu.net Home