ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..
#eenadu
6.8 అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X LTPO డిస్‌ప్లేతో ఎస్24 అల్ట్రా ఈ ఏడాది మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. స్నాప్‌డ్రాగన్ 8జెన్ 3 ప్రాసెసర్ ఇచ్చారు. 5,000mAh బ్యాటరీ, 45w ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
వెనుక వైపు 200 ఎంపీ ఓఐఎస్ కెమెరాతో పాటు 12 ఎంపీ+ 50 ఎంపీ+ 10 ఎంపీ కెమెరాలు ఇచ్చారు. 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 12జీబీ +256జీబీ ధర రూ.1,29,999, 12జీబీ +512జీబీ ధర రూ.1,39,999, 12జీబీ +1టీబీ ధర రూ.1,59,999.
యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు వచ్చాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ పేరిట నాలుగు ఫోన్లు లాంచ్ అయ్యాయి.
అడ్వాన్స్‌డ్ కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను వీటికి జోడించారు. ఐఓఎస్ 18తో పనిచేస్తుంది. ఐఫోన్ బేస్ మోడల్ ధర రూ.79 వేలు కాగా.. ప్రొ మ్యాక్స్ ధర రూ.1.44 లక్షలు.
వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఈ ఏడాది వచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 12. ఇది 6.82 అంగుళాల 2k ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8జెన్ 3 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. దీని ధరను అప్పట్లో రూ.64,999గా నిర్ణయించారు.
5,400mAh బ్యాటరీ, 100w సూపర్‌వూక్ ఫాస్ట్‌ఛార్జింగ్, 50w వైర్‌లెస్, 10w రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 50 ఎంపీ, 48 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 64 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో జూమ్‌లెన్స్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
గూగుల్ ఈ ఏడాది తన పిక్సెల్ సిరీస్‌లో 9, 9 ప్రో, 9 ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసింది. పిక్సెల్ 9 ధర రూ.79,999 కాగా.. ఫోల్డబుల్ ఫోన్ ధరను రూ.1,72,999గా పేర్కొంది.
వివో ఎక్స్200 ప్రో
6.78 అంగుళాల 2k 8టీ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే ఫన్‌టచ్ ఓఎస్‌తో ఔటాఫ్‌ది బాక్స్‌తో తీసుకొచ్చారు. 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
200ఎంపీ HP9 పెరిస్కోపిక్ రియర్ కెమెరా, 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ- 818 సెన్సర్, 50ఎంపీ శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్ కెమెరా, 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 16జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ.94,999గా నిర్ణయించారు. దీంతో పాటు వివో ఎక్స్ 200 కూడా లాంచ్ అయ్యింది.