జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలివీ

టమాటాలకు జ్ఞాపకశక్తిని పెంపొందించే గుణం ఉంటుంది. వాటిలో ఉండే 'లైకోపీన్' అనే యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు కణజాలాల్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. ఎవరైతే రోజూ టమాటాల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటారో వారి మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.

Image:Pixabay

మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, చురుగ్గా పనిచేయడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎంతో తోడ్పడతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలను పెంచి కుంగుబాటును తగ్గించడానికి సహాయపడతాయి. సాల్మన్, ట్యునా చేపలు,చియా గింజలు, గుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి.

Image:Pixabay

జ్ఞాపకశక్తి పెరిగి, ఇనుము, విటమిన్‌-ఎ, డి, ఇ, బి-12 శరీరానికి అందాలంటే రోజూ ఒక ఉడికించిన గుడ్డును తినాలి.

Image:Eenadu

తృణధాన్యాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. బ్రౌన్‌రైస్, తృణ ధాన్యాలు, చిరుధాన్యాల్లోని విటమిన్‌-బి నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు శక్తిని పెంచుతుంది.

Image:Pixabay

మెదడు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాల్లో ముఖ్యమైనవి యాంటీఆక్సిడెంట్లు. ఇవి డార్క్ చాక్లెట్లలో ఎక్కువగా లభిస్తాయి. జ్ఞాపకశక్తిని మరింత రెట్టింపు చేసుకోవాలంటే రోజుకో బైట్ చొప్పున డార్క్ చాక్లెట్ తినడం మంచిది.

Image:Pixabay

శరీరంలో నీటిస్థాయి తగినంత ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడంతో పాటు మెదడు కూడా చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Image:Pixabay

ఆరోగ్యాన్నివ్వడంలోనే కాదు.. జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ సహాయపడే పానీయం గ్రీన్ టీ. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Image:Pixabay 

వాల్‌నట్స్‌లో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ బి6, మెగ్నీషియం.. మెదడును సురక్షితంగా ఉంచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి. కాబట్టి రోజూ వీటిని తినడం మంచిది.

Image:Eenadu

ఆకుకూరలు కేవలం కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలోనే కాదు.. మెదడు చురుగ్గా పని చేయడంలోనూ సహాయపడతాయి. ఇందులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం ఆలోచనాశక్తిని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

Image:Pixabay

బీట్‌రూట్ కేవలం శరీరంలో రక్తాన్ని పెంచడంలోనే కాదు.. మెదడుకు సరిపడా రక్తాన్ని సరఫరా చేయడంలోనూ తోడ్పడుతుంది. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

Image:Pixabay

మెదడు చురుకుదనాన్ని పెంచే శక్తి పసుపుకి ఉందని పలు పరిశోధనల్లో తేలింది. కాబట్టి.. గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే అటు ఆరోగ్యం.. ఇటు జ్ఞాపకశక్తి.. రెండూ సొంతమవుతాయి.

Image:Pixabay

రసాయనాల పండునిలా గుర్తించండి..

బుల్లి దేశం తువాలు విశేషాలెన్నో..

గూగుల్‌ డూడుల్‌ గమనించారా..!

Eenadu.net Home