న్యూ ఇయర్‌ వేడుకలకు ఈ ప్రాంతాలు బెస్ట్‌!

గోవా

బీచ్‌ పార్టీలకు పెట్టింది పేరు. న్యూ ఇయర్‌ పార్టీని మరింత ఆకట్టుకునేలా నిర్వహిస్తుంటారు. డీజే, లైవ్‌ కన్సర్ట్స్‌ జరుగుతాయి. సాగరతీరంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ న్యూ ఇయర్‌ సంబరాలు చేసుకోవచ్చు.

పుదుచ్చేరి

ఇక్కడ కూడా న్యూ ఇయర్‌ కోసం బీచ్‌ పార్టీలను ఘనంగా నిర్వహిస్తారు. ఫ్రెంచ్‌ ఫుడ్‌ను రుచి చూడొచ్చు. ఆధ్యాత్మిక భావనలతో కొత్త ఏడాదిని ప్రారంభించాలంటే ఆశ్రమాలు, ధ్యాన కేంద్రాలు కూడా ఉన్నాయి.

ముంబయి

ఎప్పుడూ బిజీగా ఉండే ముంబయిలోనూ కొత్త ఏడాది వేడుకలు ఆకట్టుకుంటాయి. మెరైన్‌ డ్రైవ్‌, గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వంటి టూరిస్ట్‌ ప్రాంతాల్లో బాణసంచా వెలుగులు కనువిందు చేస్తాయి. లగ్జరీ హోటల్స్‌ రూఫ్‌టాప్‌ పార్టీలు నిర్వహిస్తుంటాయి.

జైపుర్‌

రాజస్థాన్‌లోని జైపుర్‌లో కోటలు, రాజభవనాల్లాంటి రెస్టారెంట్లు అనేకం ఉన్నాయి. వాటిల్లో కొత్త ఏడాది కోసం ప్రత్యేక వేడుకల్ని ఏర్పాటు చేస్తారు. కోటల్లో విందు, వినోదాలతో రాత్రంతా హంగామా ఉంటుంది. 

దిల్లీ

దేశ రాజధానిలో కొత్త ఏడాది వేడుకలు అద్భుతంగా సాగుతాయి. ఇండియా గేట్‌ వద్ద బాణసంచా వెలుగుల్ని చూడటానికి స్థానికులతో పాటు పర్యటకులూ వస్తుంటారు. పలు హోటళ్లు గాలా, స్ట్రీట్‌ ఫుడ్‌, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రత్యేక పార్టీలు ఏర్పాటు చేస్తాయి.

అలెప్పీ

కేరళలోని అలెప్పీకి పర్యటక ప్రాంతంగా మంచి పేరుంది. న్యూ ఇయర్‌ సంబరాలు చేసుకోవడానికి వచ్చే పర్యాటకుల కోసం హౌస్‌బోట్లలో పార్టీలు ఏర్పాటు చేస్తారు. బోటులో కేరళ రుచులు చూస్తూ.. సంగీతం వింటూ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టొచ్చు. 

రిషికేశ్‌

ఆధ్యాత్మిక దారిలో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవాలంటే.. రిషికేశ్‌ బెస్ట్‌ ఆప్షన్‌. గంగా నది తీరంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. యోగా, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. సాహసికులు హిమాలయాల్లో రాఫ్టింగ్‌, ట్రెక్కింగ్‌కు వెళ్లొచ్చు. 

కోల్‌కతా

క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలు కోల్‌కతాలో అద్భుతంగా జరుగుతాయి. నగరవీధులు, చారిత్రక కట్టడాలను మిరుమిట్లుగొలిపే లైట్లతో అలంకరిస్తారు. పర్యాటక ప్రాంతాలు, హోటళ్లలో పార్టీలు నిర్వహిస్తారు.

గోకర్ణ

కర్ణాటకలోని గోకర్ణలోనూ న్యూ ఇయర్‌ కోసం బీచ్‌ పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. ఓమ్‌, గోకర్ణ, ప్యారడైజ్‌ బీచుల్లో నిర్వహించే పార్టీలకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. కొత్త ఏడాదిలో మహాబలేశ్వరం ఆలయాన్ని సందర్శిస్తారు.

హైదరాబాద్‌

భాగ్యనగరంలో న్యూఇయర్‌ వేడుకలు అంబరాన్ని అంటుతాయి. నెక్లెస్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలు జనాలతో కోలాహలంగా కనిపిస్తాయి. శిల్పారామం, రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా న్యూఇయర్‌ వేడుకలు జరుగుతాయి.

ఫ్యాషన్‌.. ఫుడ్‌.. టూరిజం.. కేరాఫ్‌ అడ్రస్‌ ఇటలీ!

అయితే ఈ చట్టాలు మీకోసమే...

ఈ లక్షణాలు ఉండాల్సిందే..

Eenadu.net Home