భారత్‌ను చుట్టొద్దాం రండి..
సంస్కృతీ సంప్రదాయలకు నెలవుగా ఉన్న భారత్‌లో ఆస్వాదించడానికి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారత్‌లో ఉన్న టాప్ టూరిస్టు ప్రాంతాలేంటో చూద్దామా..!
(బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాలుగా ఐఆర్‌సీటీసీ సూచిస్తున్నవివే)
ఆగ్రా
పాలరాతితో నిర్మించిన తాజ్‌మహల్ కట్టడం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆగ్రాకోట, ఫతేపూర్ సిక్రీతో పాటు నోరూరించే వంటకాలు ఆగ్రాలో ఫేమస్.
ఛండీగఢ్
పంజాబ్ సంస్కృతి, ఆధునికత కలగలిసిన ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఆహ్లాదకరమైన పార్కులు, మ్యూజియం ఆకట్టుకుంటాయి.
IMAGE: CHANDIGARH TOURISM
సిమ్లా
హిమాచల్ ప్రదేశ్‌కు రాజధాని అయిన సిమ్లా భారత్ టూరిస్ట్ ప్రాంతాల్లో టాప్ టెన్‌లో ఒకటి. హనీమూన్‌కి వెళ్లే జంటలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. చుట్టూ కొండలతో చల్లటి వాతావరణంతో ఉంటుంది.
IMAGE: EENADU
ఉదయ్‌పుర్
ఈ ప్రాంతాన్ని ‘సిటీ ఆఫ్ లేక్స్’, ‘వెనిస్ ఆఫ్ ద ఈస్ట్’గా కూడా పిలుస్తారు. అందమైన ఆరావళి కొండలు చుట్టుముట్టి ఉంటాయి. శీతాకాలంలో అయితే దట్టమైన పొగమంచుతో వీక్షించేందుకు ఆహ్లాదంగా ఉంటుంది.
IMAGE: UDAYPUR TOURISM
దిల్లీ
ఫుడ్ లవర్స్‌కి దిల్లీ ప్యారడైజ్ లాంటిది. చారిత్రక కట్టడాలు, గార్డెన్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీలు చూడదగ్గవి. సాయంత్రం వేళల్లో స్ట్రీట్ ఫుడ్ కోసం జనాలు గుంపులు గుంపులుగా వీధుల్లోకి వస్తారు.
IMAGE: RKC
ఊటీ
ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీ వారికి ఊటీ హెడ్‌క్వార్టర్స్‌గా ఉండేది. ఆ తర్వాత కాలంలో టూరిస్ట్ ప్రదేశంగా అభివృద్ధి చెందింది. ప్రశాంతమైన వాతావరణంతో హిల్ స్టేషన్లు ఆకట్టుకుంటాయి.
IMAGE: OOTY TOURISM
జైపుర్
పింక్ సిటీ ఆప్ ఇండియాగా అభివృద్ధి చెందిన ప్రాతం జైపుర్. పురాతన కట్టడాలు, కోటలు, వివిధ చేతివృత్తుల ఉత్పత్తులు, అమోఘంగా ఉండే ఆహారంతో పర్యాటకులకు స్వాగతం చెప్తుందీ ప్రాంతం.
IMAGE: RAJASTHAN TOURISM
కూర్గ్
ఇండియా స్కాట్‌లాండ్‌గా పిలుచుకునే ప్రాంతం కూర్గ్. ఇది కర్ణాటకలో ఉంది. పచ్చటి కొండలు, కాఫీతోటలు చూడదగ్గవి. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం బాగా నచ్చుతుంది.
IMAGE: KOORG TOURISM
గోవా
ఇతర దేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా గోవాకి వస్తుంటారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో బీచుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
IMAGE: GOA TOURISM