కేరళలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

అలెప్పీ


అలెప్పీలోని ఉప్పునీటి సరస్సులు, సముద్ర తీర ప్రాంతాలు, నదులు, కాలువలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ముఖ్యంగా బ్యాక్ వాటర్‌లో హౌస్ బోట్ షికారు ప్రత్యేక అనుభూతినిస్తుంది.

Source:Twitter

మున్నార్‌


కేరళలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో మున్నార్ ఒకటి. ఎటుచూసినా తేయాకు తోటలు దర్శనమిస్తాయి. సుందరమైన జలపాతాలు, పొగమంచు పర్వతాలతో ఈ ప్రాంతం ఎంతో రమణీయంగా ఉంటుంది.

Source:Twitter

త్రిస్సూర్‌


త్రిస్సూర్‌ కేరళ సాంస్కృతిక రాజధాని. ఈ పట్టణంలో అనేక దేవాలయాలు, చర్చిలున్నాయి. ఏటా భారీ స్థాయిలో నిర్వహించే త్రిస్సూర్ పూరమ్‌ ఉత్సవాలు ప్రధాన ఆకర్షణ. వడక్కునాథన్‌ ఆలయం, అతిరపల్లి జలపాతాలు తప్పక చూడాల్సిందే.

Source:Twitter

కోవలం


ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని గాలి, బంగారువర్ణంలో మెరిసే మెత్తని ఇసుక, ఎత్తైన కొబ్బరి చెట్లతో ఈ ప్రదేశం స్వర్గాన్ని తలపించే విధంగా ఉంటుంది. లైట్‌ హౌస్‌ బీచ్‌, హవా బీచ్‌, రాతి గుహలు చూడవలసిన ప్రదేశాలు.

Source:Twitter  

వయనాడ్‌


అనేక జలపాతాలు, గుహలు, సరస్సులు, ఆనకట్టలు ఉన్న ఈ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతుంది. బాణాసుర సాగర్ ఆనకట్ట, కురువద్వీప్, లక్కిడి వ్యూ పాయింట్ చూడదగిన ప్రదేశాలు.

Source:Twitter

తిరువనంతపురం


సముద్ర తీరాలు, కొబ్బరి, ఈత చెట్లతో ఈ నగరం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణ. అట్టుకల్ ఆలయం, నేపియర్ మ్యూజియం, కౌడియర్ ప్యాలెస్ చూడాల్సిన ప్రదేశాలు.

Source:Twitter

కోళికోడ్


మలబార్ తీరంలో ఉండే ఈ నగరం చర్చిలు, దేవాలయాలు, అభయారణ్యాలు, జలపాతాలతో చూడముచ్చటగా ఉంటుంది. తుషారగిరి జలపాతం, కోళికోడ్ బీచ్ చూడదగిన ప్రదేశాలు.

Source:Twitter

తెక్కడి


తెక్కడి అటవీ ప్రాంతంలో ఎటుచూసినా ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుంది. ఇది ఇడుక్కి జిల్లాలో ఉంది. పెరియార్ వన్యమృగ సంరక్షణా కేంద్రం ప్రధాన ఆకర్షణ.

Source:Twitter

కొచ్చి


కేరళ ఆర్థిక రాజధాని అయిన కొచ్చి పర్యాటకంగా కూడా పేరొందింది. పోర్ట్ కొచ్చి బీచ్‌, చైనీస్‌ ఫిషింగ్‌ నెట్స్‌ చూడదగిన ప్రదేశాలు.

Source:Twitter

అత్యధిక పర్యాటకులు సందర్శించే దేశాలివే!

ఈ వ్యాయామాలు ఇంట్లోనే చేయొచ్చు!

డిజిటల్‌ యుగంలో కళ్లను కాపాడుకోండిలా!

Eenadu.net Home