అసలే వర్షాకాలం.. కరెంట్‌తో జాగ్రత్త..!

తడి చేతులతో ఎలక్ట్రిక్‌ బోర్డులో స్విచ్‌లు ఆన్‌ చేయొద్దు.

Source: Pixabay

కరెంట్ స్తంభాలు, సపోర్టు వైర్లను ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దు.

Source: Pixabay

దుస్తులు ఆరేసుకునే తీగలు విద్యుత్‌ తీగకు తగలకుండా చూసుకోవాలి.

Source: Pixabay

ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఏదైనా సమస్య వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.

Source: Pixabay

ఇంట్లో అతుకుల విద్యుత్‌ తీగలు ఉంటే వాటి స్థానంలో నాణ్యమైన వైర్లను ఏర్పాటు చేసుకోవాలి.

Source: Pixabay

తెగిపడిన, తక్కువ ఎత్తులో ఉన్న తీగలను తాకొద్దు.

Source: Pixabay

విద్యుదాఘాతానికి గురైన వ్యక్తిని కాపాడే సమయంలో అతడిని నేరుగా తాకొద్దు. ఎండిన కర్ర లేదా ప్లాస్టిక్‌ వస్తువుతో బలంగా నెట్టాలి. 

Source: Pixabay

అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి నీరు చేరి విద్యుత్తు తీగలకు తాకినా, మీటర్ల వరకు చేరినా విద్యుత్‌శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.

Source: Pixabay 

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home