సినిమాల మీద సినిమాలు.. ఎవరీ భాగ్యశ్రీ

బాలీవుడ్‌లో ‘Yaariyan 2’ తో చిత్రపరిశ్రమలోకి అడుపెట్టింది భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం తెలుగు సినిమాల ఛాన్సులతో బిజీబిజీగా ఉంది.

భాగ్యశ్రీ... అనే కంటే డెయిరీ మిల్క్‌ భాగ్యశ్రీ అంటే సులభంగా గుర్తొచ్చేస్తుంది. ఆ చాక్లెట్‌ యాడ్‌తో అంతలా పేరు సంపాదించుకుంది. 

తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాకపోయినా ఈ బ్యూటీకి భలే క్రేజ్‌ దక్కుతోంది. వరుస ఆఫర్లు వస్తున్నాయి.

This browser does not support the video element.

రవితేజ సరసన ‘మిస్టర్‌ బచ్చన్‌’లో నటిస్తున్న భాగ్యశ్రీ... గౌతమ్‌ తిన్ననూరి - విజయ్‌ దేవరకొండ సినిమాలోనూ ఛాన్స్‌ సంపాదించింది. 

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ టీజర్‌లో భాగ్యశ్రీ తళుక్కున మెరిసింది. దీంతో ఎవరీ భామ అని నెటిజన్లు వెతికేస్తున్నారు. 

సుజీత్‌ దర్శకత్వంలో నాని నటించబోయే సినిమాలోనూ భాగ్యశ్రీనే కథానాయిక అని చెబుతున్నారు. త్వరలోనే క్లారిటీ ఇస్తారని టాక్‌. 

బాలీవుడ్‌లో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా కబీర్‌ ఖాన్‌ తెరకెక్కించిన ‘చందు ఛాంపియన్‌’లోనూ భాగ్యశ్రీనే నాయిక. జూన్‌ 14న ఈ సినిమా వచ్చింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకి రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు.

భాగ్యశ్రీ ప్రకృతి ప్రేమికురాలు. అడవులు, కొండ ప్రాంతాలకు ఎక్కువగా ట్రిప్‌లు ప్లాన్‌ చేస్తూ ఉంటుంది.

ఎన్ని ఉన్నా.. జిలేబీ, చేపలకూర ఉండాల్సిందే!

త్రిప్తి వస్తే.. కుర్రకారుకు ఉక్కపోతే!

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

Eenadu.net Home