సాహసాలు.. ఐస్‌క్రీమ్‌లు..

ఇవీ భాగ్యశ్రీ ఇష్టాలు

రామ్‌ సరసన కొత్త సినిమాలో నటిస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని విషయాలు...

ఈ మరాఠీ భామ పండుగల సమయంలో ట్రెడిషనల్‌ లుక్‌లో సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది.

This browser does not support the video element.

సంగీత దర్శకుడు డీఎస్పీని కలిసినప్పుడు పియానోని ప్లే చేయించుకొని.. ‘జస్ట్‌ వైబింగ్‌’ అంటూ ఆ బీట్‌ను ఆస్వాదిస్తుంది.

భాగ్య రాముని భక్తురాలు. తరచూ రామాలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటుంది. 

ట్రిప్‌ అంటే కొండలు, వాగులు, వంకలే గుర్తొస్తాయి. ‘అడవుల్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ.. మెలొడీ పాటలు వింటూ బతికేస్తాను..’ అని అంటోంది.

ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టం. దేన్ని అయినా వదిలేస్తాను కానీ ఐస్‌క్రీమ్‌ని వదలను అంటూ తన ప్రేమ గురించి చెప్పింది.

పెంపుడు జంతువులంటే భాగ్యకి ప్రాణం. ఆ శునకాల పుట్టిన రోజు వేడుకలనూ నిర్వహిస్తుంది.   

స్కయి డైవింగ్‌, ట్రెక్కింగ్‌ వంటి సాహసాలు చేస్తూ ఉంటుందీ క్యాడ్‌బరీ బ్యూటీ. 

ఖాళీ సమయాల్లో పెయింటింగ్‌ చేస్తుంది. వంకర గీతలు పడకుండా వేస్తే అది అందమైన పెయింటింగే కాదంటోంది.

రానా, దుల్కర్‌ సల్మాన్‌తో 1950ల నాటి పీరియాడిక్‌ చిత్రంలో నటిస్తోంది 

తెలుగు అన్నా, తెలుగు సినిమా అన్నా అభిమానం. తెలుగు రాకపోయినా.. ‘మిస్టర్‌ బచ్చన్‌’ కోసం నేర్చుకొని మరీ సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొంది. 

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home