ఆటో ఎక్స్‌పోలో విద్యుత్ వాహనాల సందడి

దేశంలోని అతిపెద్ద వాహన ప్రదర్శన ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’ తొలిరోజు (జనవరి 17) సందడిగా సాగింది. పలు విద్యుత్‌ మోడళ్లు ఆకట్టుకున్నాయి.

మారుతీ సుజుకీ తొలి బ్యాటరీ విద్యుత్‌ ఎస్‌యూవీ ఇ-విటారాను ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. సింగిల్‌ ఛార్జ్‌తో 500+ km ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్‌ ఇండియా క్రెటా ఈవీని విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.17.99 లక్షలుగా నిర్ణయించింది.

సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇ- యాక్సెస్‌ను ఆవిష్కరించింది. 3.07kWh బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్‌ 95 రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

టీవీఎస్ మోటార్‌ ప్రపంచంలోనే ఫస్ట్‌ సీఎన్‌జీ స్కూటర్‌ జుపిటర్‌ 125 CNGని ఆవిష్కరించింది. ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన విభాగంలో 18 కొత్త కార్లు, ఎస్‌యూవీలను తీసుకొచ్చింది. అందులో ‘సియారా’ ఈవీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కియా ఇండియా నవీకరించిన విద్యుత్‌ ఎస్‌యూవీ ఈవీ6ను ప్రదర్శించింది. బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మే నెలలో ధర ప్రకటించనుంది.

 జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా సైబర్‌స్టర్‌, ఎంజీ ఎం9 కార్లను ఆవిష్కరించింది. ఇప్పటికే ఎంజీ విండ్‌సోర్, ఎంజీ కామెట్, ఎంజీ జడ్‌ఎస్‌ విద్యుత్‌ కార్లను విక్రయిస్తోంది. 

బీఎండబ్ల్యూ ఇండియా తొలిసారిగా పూర్తిగా స్థానికంగా తయారు చేసిన విద్యుత్‌ కార్‌ ‘ఎక్స్‌ 1 లాంగ్‌ వీల్‌ బేస్‌’ను భారత్‌ ఆటో ఎక్స్‌పో వేదికగా ఆవిష్కరించింది. దీని ధర రూ.49 లక్షలు.

మెర్సిడెస్‌ బెంజ్ సరికొత్త ఈక్యూఎస్‌ మేబ్యాక్‌ ఎస్‌యూవీ 680 ‘నైట్‌ సిరీస్‌’ను విడుదల చేసింది. ఈ కారు ధర రూ.2.63 కోట్లుగా నిర్ణయించింది.

షేక్‌ చేస్తున్న డీప్‌సీక్‌

జియో, ఎయిర్‌టెల్‌, వీఐ వాయిస్‌ ఓన్లీ ప్లాన్స్‌

అధిక విలువ కలిగిన షేర్లు ఇవే!

Eenadu.net Home