‘లేడీ కిల్లర్‌’ భూమి పెడ్నేకర్‌

వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కమర్షియల్‌ విజయాలు అందుకొంటూ ముందుకెళుతోంది బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్‌.

image:Bhumi Pednekar/Instagram 

అక్షయ్‌కుమార్‌ హీరోగా అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ‘రక్షాబంధన్‌’లో భూమి పెడ్నేకర్ నటించింది. ఈ చిత్రం తాజాగా విడుదలైంది.

image:Bhumi Pednekar/Instagram 

ఈ సందర్భంగా భూమి పెడ్నేకర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..

image:Bhumi Pednekar/Instagram 

ఈ బ్యూటీ 1989 జులై 18న ముంబయిలో జన్మించింది. భూమి తండ్రి సతీశ్‌ గతంలో మహారాష్ట్ర హోం, కార్మిక శాఖామంత్రిగా పనిచేశారు.

image:Bhumi Pednekar/Instagram 

సినిమాల్లోకి రాకముందు ఆరేళ్లపాటు యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది భూమి.

image:Bhumi Pednekar/Instagram 

ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ ‘దమ్ లగా కే హైషా’తో తొలిసారి వెండితెరపై మెరిసింది. ఈ చిత్రంలో నటనకుగాను భూమికి ఉత్తమ పరిచయ నాయికగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు లభించింది.

image:Bhumi Pednekar/Instagram 

అలా ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా’, ‘శుభ్‌ మంగళ్‌ సావ్‌ధాన్‌’, ‘సోంఛిరియా’, ‘శాండ్‌ కీ ఆంఖ్‌’, ‘బాలా’, ‘భూత్’, ‘డోలీ కిట్టీ ఔర్‌ వో ఛమక్తే సితారే’ తదితర చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించింది.

image:Bhumi Pednekar/Instagram 

మొదట్లో భూమి లావుగా ఉండేది. తొలి చిత్రం విడుదలైన తర్వాత ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి స్లిమ్‌గా మారి అందరినీ ఆశ్చర్యపర్చింది. నాజుగ్గా తయారుకావడంతో చేతినిండా సినిమా అవకాశాలతో బిజీగా ఉంటోంది.

image:Bhumi Pednekar/Instagram 

‘పెళ్లి చేసుకోకపోయినంత మాత్రాన అమ్మాయిలకు కలిగే నష్టం ఏమీ లేదు. ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది వారి ఇష్టాయిష్టాల ప్రకారమే జరగాలి’ అని పెళ్లిపై తన అభిప్రాయాన్ని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

image:Bhumi Pednekar/Instagram 

‘దాంపత్య బంధాన్ని గట్టిగా విశ్వసిస్తాను. నాకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది. నలుగురు పిల్లలకు తల్లిగా మారాలనుంది’ అని ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటని బయటపెట్టేసింది.

image:Bhumi Pednekar/Instagram 

ఈ భామ నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘ది లేడీ కిల్లర్‌’, ‘అఫ్వా’ చిత్రీకరణ జరుపుకొంటున్నాయి.

image:Bhumi Pednekar/Instagram 

భూమి పెడ్నేకర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌. ఎప్పటికప్పుడు తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.

image:Bhumi Pednekar/Instagram 

ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఈమెకు 7.2 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

image:Bhumi Pednekar/Instagram 

జలకాలాటలలో సినీభామలు

పీఎస్‌-1: తారల పారితోషికమెంతో తెలుసా?

ఆ‘రేంజ్‌’లో అదిరిపోయారు

Eenadu.net Home