ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియాలు ఇవే!


అహ్మదాబాద్‌లో ఉన్నమొతేరా క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దది. దాదాపు 63 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియంలో 1.32 లక్షల మంది కూర్చోవచ్చు.

Source: Twitter

మెల్‌బోర్న్‌ క్రికెట్ స్టేడియం (ఎంసీజీ) ప్రపంచంలో రెండో అతిపెద్దది. ఈ స్టేడియంలో 1,00,024 మంది ఒకేసారి మ్యాచ్‌ని వీక్షించొచ్చు. 

Source: Twitter

కోల్‌కతా నగరంలో ఉన్న ఈడెన్‌గార్డెన్స్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టేడియం. దీని సీటింగ్ కెపాసిటీ 68,000.

Source: Twitter

షాహెద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఉంది. ఈ స్టేడియంలో 65,400 మంది ఒకేసారి మ్యాచ్‌ని వీక్షించొచ్చు.

Source: Twitter

ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఉన్న పెర్త్‌ క్రికెట్ స్టేడియం ఈ జాబితాలో ఐదోస్థానం దక్కించుకుంది. ఈ స్టేడియం సీటింగ్‌ కెపాసిటీ 61,266.

Source: Twitter

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్వహణలో ఉంది. ఈ స్టేడియంలో 55,000 మంది ఒకేసారి మ్యాచ్‌ని వీక్షించొచ్చు.

Source: Twitter

తిరువనంతపురంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేసీఏ) అధీనంలో ఉంది. ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 55,000.

Source: Twitter

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ నగరంలో ఉన్న అడిలైడ్‌ ఓవెల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సీటింగ్‌ కెపాసిటీ 53,583.

Source: Twitter

చెన్నైలో ఉన్న ఎం.ఏ. చిదంబరం (చెపాక్‌) స్టేడియం సీటింగ్‌ కెపాసిటీ 50,000.

Source: Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home