ప్రపంచంలో టాప్ డేటా లీక్స్ ఇవీ..!
యాహూ
దాదాపు 300 కోట్ల యాహూ యూజర్ల అకౌంట్లకు సంబంధించిన వివరాలు 2013లో లీక్ అయ్యాయి. ఈ విషయం 2016లో బయటపడింది.
టోరెంట్ తదితర వెబ్‌సైట్లు
టోరెంట్‌సహా మరో నాలుగు వెబ్‌సైట్ల నుంచి 2019లో 290 కోట్ల యూజర్ నేమ్స్(ఇందులో 77.3 కోట్ల మెయిల్ ఐడీలు, 2.1 కోట్ల పాస్‌వర్డ్స్) లీక్ అయ్యాయి.
ఆధార్
భారత్‌లో విశిష్ట గుర్తింపు సంఖ్య.. ఆధార్ కూడా లీక్‌కు గురైంది. 2017-18 మధ్య 13 కోట్ల మంది ఆధార్ నంబర్లు, చిరునామా, ఫోన్ నంబర్లు, ఫొటోలు లీకయ్యాయట. పలుమార్లు ఇలాంటి వార్తలొచ్చినా.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండించడం గమనార్హం.
ఫస్ట్ అమెరికన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్
అమెరికాకు చెందిన అతిపెద్ద ఆర్థిక సంస్థ ఇది. 2019లో 88.5కోట్ల మంది బ్యాంక్ ఖాతాదారుల వివరాలు, లావాదేవీలు, తనఖా పెట్టిన పేపర్ల వివరాలు లీకయ్యాయి.
వెరిఫికేషన్స్.ఐఓ
ఇమెయిల్ వెరిఫికేషన్ చేసే ఈ సంస్థ నుంచి 2019లో 80కోట్ల రికార్డులు లీకయ్యాయి. అందులో ప్రజల ఇమెయిల్ అడ్రెస్, పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామా, బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇలా అనేక వివరాలున్నాయి.
ఆన్‌లైన్ స్పామ్ బాట్
ఇదొక స్పామ్. 2017లో 71.1 నెటిజన్ల కంప్యూటర్లలో చొరబడి వ్యక్తిగత, క్రెడిట్ కార్డు వివరాలు, పాస్‌వర్డ్స్‌ను చోరీ చేసింది.
ఈక్విఫాక్స్
అమెరికాకు చెందిన క్రెడిట్ బ్యూరో సంస్థ ఇది. 2017లో దాదాపు 16.2 కోట్ల కస్టమర్లకు సంబంధించిన క్రెడిట్ కార్డు వివరాలు లీకయ్యాయి. అందులో కోటీన్నరకిపైగా కస్టమర్లు బ్రిటన్‌కు చెందిన వారున్నారు.
ఫేస్‌బుక్
ఈ సోషల్‌మీడియాను ఉపయోగిస్తున్న 53.3 కోట్ల మంది యూజర్ల వివరాలు 2021లో లీక్ అయ్యాయి. దీనికి సంబంధించి మెటా సంస్థకు 276 మిలియన్ యుఎస్ డాలర్ల జరిమానా కూడా పడింది.
యాహూ
మళ్లీ 2014లో 50 కోట్ల మంది యాహూ యూజర్లకు సంబంధించిన పాస్‌వర్డ్స్, వ్యక్తిగత వివరాలు, సెక్యూరిటీ ప్రశ్నలు లీక్ అయ్యాయి. పేరు చెప్పకుండా కొన్ని దేశాలు కావాలనే హ్యాకర్లతో ఈ పని చేయించాయని యాహూ ఆరోపించింది.
ఫ్రెండ్‌ఫైండ్ నెట్‌వర్క్స్
ఈ డేటింగ్ యాప్‌లో 41.2 కోట్ల మంది యూజర్ల వివరాలు లీకయ్యాయి. ఈ ఘటన 2016లోనే జరిగింది.
(Photos: google/twitter/official websites)