సుమంత్‌ సినిమాలో బిహార్‌ ‘మిస్‌ యూనివర్స్‌’!

సుమంత్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో నాయికగా బిహార్‌కి చెందిన మిస్‌ యూనివర్స్‌ కాజల్‌ చౌదరిని ఎంపిక చేశారు. 

సన్నీ కుమార్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. తాజాగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్‌ గురించి అభిమానులు నెట్టింట వెతకడం మొదలుపెట్టారు.

అసలు సంగతి ఏంటంటే.. ఈమె వెండితెరపై ఎంట్రీ ఇచ్చేది ఈ సినిమాతోనే..! అందాల పోటీల్లో మిస్‌ యూనివర్స్‌ బిహార్‌ 2024 కిరీటాన్ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.   

పాట్నాలో పుట్టిన ఈమె చదువంతా స్థానికంగానే సాగింది. బిహార్‌ ఫ్లైయింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంది. ప్రస్తుతం పైలట్‌గా ట్రైనింగ్‌ తీసుకుంటోంది.

అందాల పోటీలపై ఉన్న ఆసక్తితో మోడలింగ్‌ మొదలు పెట్టింది. అలాగే పైలట్‌ కావాలనేది తన చిన్ననాటి కల అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

‘బిహార్‌ మిస్‌ యూనివర్స్‌ కిరీటం నాకు ఒక్క రోజులో దక్కింది కాదు. దీని వెనక ఎన్నో రోజుల కష్టం ఉంది. దాని ఫలితమే ఇది. కష్టపడండి దాని ఫలితాన్ని ఆస్వాదించండి’అని అంటోంది కాజల్‌.

అలాగే ఈ భామ ఖాళీ సమయం దొరికితే కవితలు రాసేస్తుందట. పుస్తకాలు చదవడం ఈమె హాబీ. పాటలు పాడటం, డ్యాన్స్‌ చేయడం అంటే ఆసక్తి. 

‘నీ చుట్టూ ఉన్న వాళ్లకి ఎంత ప్రేమని అయితే పంచుతావో.. అంతకు రెట్టింపు ప్రేమ తిరిగి నీ దగ్గరకు వస్తుంది’ అని కాజల్‌ తల్లి చెప్పిందట. ‘నాతో పాటు మీరూ ఈ పాలసీని పాటించొచ్చు’ అని అంటోందీమె. 

‘నాకు నచ్చిన విధంగా దుస్తులు ధరిస్తాను. అది నా ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. సమాజంపై కాదు. స్త్రీలు ధైర్యంగా, ఒంటరిగానైనా జీవించగలరు వారిలో ఆ సత్తా ఉంది’అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది.

బీచ్‌లో ఆడుకోవడం ఈ బ్యూటీకి బాగా నచ్చుతుంది. ‘ఉదయం నుంచీ సాయంత్రం వరకూ బీచ్‌లో ఉన్నా సమయమే తెలియదు’ అని చెబుతోంది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇన్‌స్టా ఖాతాకి 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది.

ఈ ఏడాది అత్యధికంగా వెతికిన సినిమాలివే!

ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే

కీర్తి.. కల్యాణం.. కమనీయం

Eenadu.net Home